Sujana Chowdary denies taking loan from Mauritius bank

Sujana chowdary shrugs off loan fraud charges

y s chowdary, y s chowdary nbw, sujana chowdary, sujana chowdary non-bailable warrant, mauritius-based bank, Mauritius Commercial Bank, default repayment of loan, sujana chowdary, arrest warrant, sujana group of companies, Mauritius-based company, Hestia Holdings Ltd,

Union minister of state for science and technology Y. Sujana Chowdary on Friday shrugged off the loan fraud charges by a Maritius bank in which connection a non-bailable arrest warrant was issued.

కోర్టులనే తప్పబడుతున్న కేంద్ర మంత్రి సుజనా..?!

Posted: 04/09/2016 02:49 PM IST
Sujana chowdary shrugs off loan fraud charges

మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పడం ద్వారా కోర్టులనే తప్పుబడుతున్నారా..? లేక మీడియాను తప్పుబట్టిస్తున్నారా..? అంటే ఔనన్న సమాధానాలే వినబడుతున్నాయి. తమ కంపెనీ.. వేరే కంపెనీకి కార్పోరేట్ గ్యారంటీ మాత్రమే ఇచ్చిందని, తాను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇవ్వలేదని ఆయన చెప్పాడం కూడా ఆయన నిజాయితీని సవాలు చేస్తున్నట్లుగానే వుంది. ఇది పూర్తిగా కార్పోరేట్ అంశమని దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని సుజనా చౌదరి చెబుతున్నా.. ఈ అంశం అంతటితోనే ముగిసిపోతుందా..? దాని పరిధి ఎంతవరకు వుంటుంది అన్ని విషయాలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి సుజనా చౌదరి చెబుతున్నట్లు ఈ అంశం పూర్తిగా కార్పోరేట్ అంశమే అయినా.. అసులు అక్కడ స్థాపించిన కంపెనీ ఎవరిది..? ఎవరి కంపెనీకి సుజనా చౌదరి కంపెనీ గ్యారెంటకీ పెట్టింది..? ఆ కంపెనీ ఎన్ని కోట్లు మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది..? అంత సోమ్మును ఆ సంస్థకు బ్యాంకు మంజూరు చేయడానికి కారణమేంటి..? గ్యారెంటర్ గా ఓ సంస్థకు హామీ ఇచ్చే ముందు ఆ స్థంపై సుజనా సంస్థకు పూర్తి నమ్మకం కుదిరిందా..?  అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

సుజనా చౌదరికీ చెందిన సుజనా యూనివర్సిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ తన సబ్సిడరీ కంపెనీగా హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ ను మారిషస్ లో స్థాపించింది. అంటే ఇది కూడా సుజనా చౌదరికీ చెందిన కంపెనీయే. అయినా మరో కంపెనీకి గ్యారెంటీగా తన సంస్థ వుంది అని సుజనా చౌదరి చెబుతున్న మాట్లల్లో నిజమెంతో, వాస్తవమేమిటో ఆయనకే తెలియాలి, ఇక ఈ కంపెనీ స్థాపించిన తరువాత మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 106 కోట్ల రూపాయల రుణం తీసుకున్న హెస్టియా సంస్థ ఆ రుణం తీర్చకుండానే చాపచుట్టేసింది, దీంతో తమకు కోట్ల రూపాయలు బాకీ పడిన సుజనాపై మారిషస్ బ్యాంకు న్యాయపోరాటానికి దిగింది.

మారిషస్ బ్యాంకులో రుణం ఎగవేతకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో సుజనా సంస్థకు సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏకీభవించడంతో.. సుజనా చౌదరికి వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి, ఇక ఈ విషయంలో కిమ్మనకుండా వుండిపోయిన సుజనా చౌదరి తన తరుపు కూడా బలమైన న్యాయవాదులను బరిలోకి దింపి న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ క్రమంలో గత మూడు పర్యాయాలుగా న్యాయస్థానంలో హాజరుకానందుకు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అధినేతగా ఆయనపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది. తనకున్న ఒత్తిడి ప్రకారం.. తమ లీగల్ కౌన్సిల్ సలహా మేరకు కోర్టు తనకు మినాహాయింపు ఇవ్వాలని కోరానని, అయినా వారంట్ ఇష్యూ చేశారని చెప్పారు. తాను సుజనా గ్రూప్‌కు వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని చెప్పారు. 2012లో అప్పు తీసుకున్నారని, 2014లో డిఫాల్ట్ అయ్యారని తెలిసిందన్నారు.
 
సంస్థ వ్యవస్థాపకులుగా వున్నంత మాత్రన సుజనా చౌదరిపై బ్యాంకులు కేసులు ఎందుకు వేశాయి, అసులు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వున్న వ్యక్తిని బ్యాంకులు ఎందుకు టార్గెట్ చేశాయి..? అసలు సుజనా చౌదరిపై వ్యక్తిగతంగా కేసులు ఎందుకు పెట్టాయి. అసలు ఆ విధంగా కేసులు పెట్టాయా..? లేదా..? అన్న విషయాలను పక్కనబెడితే.. బ్యాంకులు పెట్టిన కేసులను న్యాయస్థానాలు పరిగణలోకి ఎలా తీసుకున్నాయని, అంటే అక్కడ ఎంతో కొంత ఆయన ప్రమేయముందన్న విషయం అర్థమవుతుంది.

అలాకాని పక్షంలో న్యాయస్థానాలు అసలు ఆయనను తమ ఎదుట హాజరుకావాలని ఎలా అదేశిస్తాయి. అయినా తన లీగల్ కౌన్సిల్ ఈ అంశాన్ని ఎందుకు న్యాయస్థానంలో ప్రస్తావించలేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరునంలో మంత్రి మీడియా సమావేశంలో తనకు సంబంధం లేదని చెప్పడం.. న్యాయస్థానాలను తప్పుబట్టడమే అవుతందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఇక ఆఫ్రికాకు చెందిన కంపెనీలో తాను డెరైక్టర్ని కూడా కాదని, అందులో తనకు ఒక శాతం కంటే తక్కువ వాటా మాత్రమే ఉందని... ఆ కంపెనీ మారిషస్ బ్యాంకు నుండి రుణం తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నామని తెల్పారని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంక్ లోన్ ఎప్పుడు కట్టాలో కంపెనీ బోర్డు చూసుకుంటుందని, తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయమన్నారు. దీని వల్ల తన రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదన్నారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇది సుజనా చౌదరి ఒక్కరికో లేక ఆయన కార్పోరేట్ సంస్థ సుజన యూనివర్సిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకో సంబంధించిన సంస్థకు మాత్రమే సంబంధించిన అంశంమో లేక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశమో అయితే అంతటితో సమస్య ముగిసిపోయేది. కానీ కేంద్ర మంత్రి హోదాలో సుజనా చౌదరి ఎదుర్కోంటున్న ఈ కేసు అంశాన్ని యావత్ దేశమే ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఒక పక్క ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. దేశంలో నిబంధనలు కఠినతరం చేశామని, అందుకే రుణఎగవేతదారులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని ప్రకటిస్తుంటే.. ప్రధాని మోడీ క్యాబినెట్ లోనే ఎగవేతదారుడా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sujana chowdary  arrest warrant  sujana group of companies  nampally court  

Other Articles