Amit Shah reaches out to Dalits, farmers in election-bound UP

Amit shah dines with dalits at varanasi village

up election 2017, BJP strategy in U.P., Dalit vote bank, uttar pradesh elcetons, uttar pradesh assembly election, Amit Shah, Bjp Amit Shah, Jogiapur village, Bjp Worker lunch, election jimmics, hcu, hyderabad central university, rohit vemula, jnu, kanhaiah kumar, ambedkar students union

BJP president Amit Shah had lunch at a Dalit home in Varanasi and addressed a farmers’ rally in Allahabad

దండనలు.. బోజనాలు.. బీజేపి ఎన్నికల బాగోతాలు..

Posted: 06/01/2016 12:46 PM IST
Amit shah dines with dalits at varanasi village

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే తలపిస్తోంది. అందుకు ఇప్పటి నుంచే ఎన్నికల బాగోతాలను కూడా ప్రారంభించింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఎలాంటి హడావుడి లేకుండా మెల్లగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో వున్న బిసీ, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ వర్గాలను తమ వైపు మలుచుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం దక్కించుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న తలంపుతో ముందుకు వెళుతోంది.

ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తునే ఉన్నారు. మంగళవారం ప్రధాని నరంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన ఆయన మధ్యాహ్నం పార్టీ కార్యకర్త అయిన ఓ దళితుల ఇంట్లో భోజనం చేశారు.  అలహాబాద్ నుంచి వారణాసి విమానాశ్రాయానికి వెళ్లే మార్గంలో సేవాపురి అనే గ్రామంలో గిరిజాప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళిత దంపతుల ఇంట్లో ఆయన లంచ్ చేశారు. దానిని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం కూడా చేయడం ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలసివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలానే ఎన్నికల వేళ బీజేపి బాగోతాలకు తెరలేపిందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాలపై పార్టీ తరపున ఏ ఒక్క మాట మాట్లాడటానికి కూడా ఇష్టపడిన అమిత్ షా ఎన్నికల వేళ పార్టీకి చెందిన దళిత కార్యకర్త ఇంట్లో బోజనం చేస్తే సరిపోతుందా..? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సౌ చూహా ఖానేకా బాద్ బిల్లి హాజ్ కు నిఖిలీ ( వంద ఎలుకలను తిన్న తరువాత తాను చాలా పవిత్రురాలినని పిల్లి హాజ్ యాత్రకు బయలుదేరిందన్న) నానుడి అమిత్ షాను చూస్తే గుర్తుకువస్తుందని కూడా పలువురు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలను, వారికి మద్దతుగా నిలిచిన నేతలు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చావ చితకకోట్టించిన కేంద్రం, అందకనుగూణంగా పావులు కదిపిన బీజేపి కేంద్ర మంత్రలు, తమ ఏబీవీపీ విద్యార్థులకు అండగా నిలిచేందుకు విశ్వవిద్యాలయంలోకి వెళ్లి తిష్టవేసిన స్థానిక బిజేపి నేతలు.. అమిత్ షా దళిత కార్యకర్త ఇంట్లో బోజనం చేయడంపై స్పందించాలని చెప్పారు.

ఏబివీపి కాదని అధికారంలోకి అంబేద్కర్ విద్యార్థి సంస్థ రావడంతో జీర్ణించుకోలేని బీజేపి నేతలు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి.. గతంలో దళిత విద్యార్థులను రస్టికేట్ చేసి. దళిత వ్యతిరేకగా ముద్రవేసుకున్నవైస్ ఛాన్సిలర్ అప్పారావును అఘమేఘాల మీద హైదరాబాద్ యూనివర్సిటీకి బదిలీ చేసి తీసుకువచ్చారన్న అరోపణలు వున్నాయి. దీనికి తోడు రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో నిజనిర్థారణ కమిటీని వేసిన కేంద్రానికి వైస్ ఛాన్సిలర్ నిర్లక్ష్యం వల్లే వేములు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసినా.. ఆతనిపై చర్యలు తీసుకోకుండా కోనసాగించడంపై బీజేపి దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ వినిపిస్తుంది.

నిజంగా అమిత్ షా దళిత సంక్షేమాన్ని కాంక్షించేవారైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి దళిత విద్యార్థులతో కలసి బోజనం చేయాలని పలువురు రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపికి ఎన్నికల వేళ మాత్రమే దళితులు గుర్తుకువస్తారా..? అంటూ ఇప్పటికే పలు పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మాయవతి నేతృత్వంలోని బీఎస్సీ పార్టీ అమిత్ షా ధళిత ఇంట బోజనాన్ని పెద్ద ఎన్నికల నాటకంగా పేర్కోంది. బీజేపి ఎన్ని ఎత్తులు వేసినా దళిత, గిరిజనులు బీజేపిని విశ్వసించబోరని దుయ్యబట్టింది. గతంలో రాహుల్ గాంధీ కూడా అనేక మంది దళిత ఇళ్లకు వెళ్లారని, అయినా ఆ పార్టీకి ఎన్నికలలో పరాభవమే ఎదురైందని, ఇప్పుడు బీజేపికి కూడా అదే గతి పడుతుందని అమె ద్వజమెత్తారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles