స్వామి లేఖలు వర్కవుట్ కావట్లేదా? | Modi will extend Raghuram Rajan's tenure

Modi will extend raghuram rajan s tenure

Subramanian Swamy, RBI Governor, Raghuram Rajan, PM modi, సుబ్రహ్మణ్యస్వామి, రఘురామ రాజన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, తాజా వార్తలు, modi news, national news, latest news, telugu news

Subramanian Swamy has written to the Prime Minister, seeking the ouster of Raghuram Rajan as RBI Governor. But, Modi has made up his mind to extend Raghuram Rajan's tenure as Reserve Bank of India governor.

స్వామి లేఖలు వర్కవుట్ కావట్లేదా?

Posted: 06/01/2016 04:25 PM IST
Modi will extend raghuram rajan s tenure

ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యవహార శైలిపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ బీజేపీ నేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కేంద్రాన్ని కోరుతున్నారు. ఈమేరకు గత కొద్ది కాలంగా ఆయన ప్రధాని మోదీకి వరుసగా లేఖలు కూడా రాస్తున్నారు. దేశ రహస్య సమాచారాన్ని, సున్నితాంశాలను సరిహద్దులు దాటిస్తున్నాడని , చాలాసార్లు దేశానికి, కేంద్రానికి వ్యతిరేకంగా రాజన్ వ్యాఖ్యలు చేశారన్నది స్వామి చేస్తున్న ఆరోపణలు. అయితే రాజన్ ను తొలగించొద్దంటూ లక్షల మంది ఆన్ లైన్ పిటీషన్ లో సంతకాలు చేశారు. ఆయన నిర్ణయాలతో ఆర్థిక వ్వవస్థ గాడిలో పడుతోందని, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రధాని మదిలో ఏముందనేది అసలు ప్రశ్న. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ రాజన్ కొనసాగింపుపై నిర్ణయాన్ని సెప్టెంబరులో మాత్రమే తీసుకోగలమని వ్యాఖ్యానించడంతో ఆసక్తి నెలకొంది.  

వాస్తవానికి రాజన్ హయాంలోనే భారత బ్యాంకింగ్ సెక్టారులో కీలక మార్పులు అమలయ్యాయి. అంతకుముందు వరకూ రుణాల మంజూరులో పాటించిన విధానాన్ని రాజన్ మరింత కఠినం చేశారు. బ్యాంకుల ఎన్పీఏ పెరగకుండా నిలువరించారు. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తనవంతు కృషి చేశారు. వందల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వాటిని ఎగ్గొట్టిన బడాబాబులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. రుణ ఎగవేతదారుల జాబితా సుప్రీంకోర్టుకు అందింది. ఇవన్నీ ప్రజల్లో ఆయన పేరుకు మద్దతు పెంచాయి. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్లను దాటి ముందుకు సాగనున్న తరుణంలో రాజన్ వంటి నిపుణుడి సేవలు అవసరమని మోదీకి పలువురు ప్రభుత్వ అధికారులు సైతం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

రాజన్ సిద్ధంగా ఉంటే మరోసారి అవకాశం కచ్చితంగా లభిస్తుందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారాం వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యవస్థ అడ్డుకున్నా, ఆ ప్రభావం ఆయనపై ఉండబోదని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాజన్ బాధ్యతలను చేపట్టాక ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగాయి. ప్రధాని స్వయంగా ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన విజయవంతం కావడానికి రాజన్ తీసుకున్న చర్యలు ఆయన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే అసహనం పెరిగిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ మరోసారి అవకాశం ఆయన్నే పలకరించవచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  RBI Governor  Raghuram Rajan  PM modi  telugu news  

Other Articles