చిచ్చు మెల మెల్లగా రాజుకుంటుందా? | internal conflicts in TDP over RS seats and party shiftings

Internal conflicts in tdp over rs seats and party shiftings

TDP, Internal conflicts, rajyasabha seat, party shiftings, తెదేపా, రాజ్యసభ సీట్ల కేటాయింపులు, పార్టీ ఫిరాయింపులు, అసంతృప్తి, latest news, AP politics, telugu news

internal conflicts in TDP over RS seats and party shiftings.

చిచ్చు మెల మెల్లగా రాజుకుంటుందా?

Posted: 06/02/2016 03:03 PM IST
Internal conflicts in tdp over rs seats and party shiftings

అధికారంలోకి వ‌చ్చిన దాదాపుగా రెండు ఏళ్లు పూర్తికావ‌స్తున్నా.. ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీలేద‌న్నది జ‌గ‌(న్)మేరిగిన స‌త్యం. అయితే పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోకలేకపోయినప్పటికీ నేతల అంసతృప్తిని ఆయన తగ్గించలేకపోతున్నారన్నది తోటి నేతల వాదన. అంత సవ్యంగా జరిగిందనుకున్న రాజ్యసభ సీట్ల వ్యవహారం, పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు అగ్గిని రాజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తరపున కర్నూల్ సీనియర్ నేత టీజీవెంకటేష్, కేంద్రమంత్రి సుజానా చౌదరీలన ఎంపిక చేసింది విదితమే. వైసీపీ నుంచి ప్రస్తుతం వలసలు కొనసాగుతున్నాయి కూడా. అయితే నిన్నటిదాకా వీటిపై కిక్కురుమనకుండా ఉన్న వారంతా ఇప్పుడు మెల్లగా సీన్లోకి వచ్చేస్తున్నారు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న తమకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, ఎంతోకాలంగా వేచిచూస్తున్నప్పటికీ ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏంటని నిలదీస్తున్నారు. మొన్నామధ్య ఓ సీనియర్ నేత బహిరంగంగానే సీట్ల కేటాయింపులపై నిరసనగళం విప్పాడు. ప్రస్తుతం టీజీ సీటుపై కర్నూలో పెద్ద గొడవలే జరుగుతున్నాయి. తొలుత బీసీ సామాజిక వర్గానికి ఈ దఫా సీటు గ్యారెంటీ అన్న వాదన వినిపించగా, చివరి నిమిషంలో ఆర్యవైశ్య వర్గానికి చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ సీటు దక్కింది. దానిపై ఆశలు పెట్టుకున్న బీటీ నాయుడు సైటెంట్ గానే ఉన్నప్పటికీ... ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. గురువారం ఉదయం కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని బీసీ నేతలు ముట్టడించారు. దీనికి ప్రస్తుత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ నేతృత్వం వహించడం విశేషం. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు చంద్రబాబు మొండి చేయి చూపించారని వారంతా ఆరోపించారు. పార్టీలు మారిన వారికి, డబ్బు మూటలు ముట్టజెప్పిన వారికి చంద్రబాబు సీట్లిచ్చారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మరింతగా అగ్గిరాజేస్తుంది. ఎమ్మెల్యేల రాకతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు ముఖ్యనేతలు, క్షేత్రస్థాయి కేడర్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మొన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాకను ఆ నియోజకవర్గ నేతలు కరణం బలరాం వ్యతిరేకించగా, తాజాగా గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబుతో పాటు ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా వరుస నేతల మధ్య ఏర్పడే అంతర్యుద్ధాలను కేవలం తాత్కాలికంగానే పరిష్కరిస్తూన్నారనే అపవాదు చంద్రబాబు మూటగట్టుకున్నారు.

కేంద్రం నుంచి సాయం అందక వైరాగ్యంతో నవనిర్మాణ దీక్ష చేస్తున్న అధికార పక్షానికి ఈ సమస్యలు అదనపు తలనొప్పిగా మారాయి. మరి వీటి నుంచి త్వరగా కొలుకుంటుందా ? లేదా చతికిల పడుతుందా ? చూడాలి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Internal conflicts  rajyasabha seat  party shiftings  telugu news  

Other Articles