తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గార్కి నచ్చని విషయం ఏదన్నా ఉంది అంటే అది రాజకీయంగా ఆయన్ని విమర్శించడమే. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలందరి మీద ఓ కన్నేసి ఉంచాలని ఇంటలిజెన్స్ అధికారులకు ఆయన సూచించారనే ఓ టాక్ కూడా ఉంది. ఒకవేళ పొరపాటున నోరు జారి లీడర్ల నోటి వెంట కేసీఆర్ ను తులనాడుతూ ఏదన్నా పదం వచ్చిందంటే చాలూ వారిని ముప్పుతిప్పలు పెట్టేదాకా ఆయన ఊరుకోరని పరిశీలకులు చెబుతూనే ఉంటారు.
మచ్చుకు ఉదాహరణలు చూద్దాం. పొన్నాల లక్ష్మయ్య గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో కేసీఆర్ పాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఈయనగారికి తొందరగానే పంచ్ ఇచ్చారు టీ సీఎం. ఆయన వ్యక్తిగత గన్ మెన్లను విధుల నుంచి తొలగించి గట్టి దెబ్బే కొట్టారు. ఇక టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం గమనిస్తే... ఓటుకు నోటు లో బుక్ అయి బయటికి వచ్చాక కూడా కేసీఆర్ పై ఆయన దారుణమైన కామెంట్లు చేశాడో మనకు తెలిసిందే. దాని ఫలితం ఆయన వ్యక్తిగత సిబ్బంది ఊస్టింగ్ కూడా జరిగిపోయింది.
ఇక ఇప్పుడు మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంతు అయ్యింది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం పథకంపైనా, రుణ మాఫీపైనా ఆమె ప్రెస్ మీట్లు పెట్టి మరీ తెలంగాణపై విరుచుకుపడింది. మరి ఆయన ఊరుకుంటారా? కట్ చేస్తే ఆమె పర్సనల్ గన్ మెన్ ను వెంటనే విధుల నుంచి తిరిగొచ్చేయని ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఆమె గన్ మెన్ కు విధుల నుంచి రిలీవ్ కావాల్సిందిగా ఎప్పుడో ఉత్తర్వులు అందాయి. కానీ, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవటంతో ఇన్నాళ్లూ కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. కానీ, ఆమె గురి కేసీఆర్ వైపు మళ్లటంతోనే ఇలా నిర్ణయం తీసుకున్నారని ఇట్టే అర్థమైపోతుంది. అంటే కేసీఆర్ ను ప్రశ్నిస్తే పీకేయడం అనే పాలసీ ఇప్పుడు నడుస్తోందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more