Rohith Vemula Was Not A Dalit, Says Panel Set Up By HRD Ministry

Rohit vemula is not a dalit says probe commission

Rohith Vemula, Prakash Javadekar, HRD Ministry, AK Roopanwal Commission, Schedule Caste (SC), Dalit, Hyderabad Central University (HCU), University Grant Commission (UGC), VS Oberoi

The Justice AK Roopanwal Commission, which was constituted by the HRD Ministry to look into the circumstances leading to the death of Dalit scholar Rohith Vemula in Hyderabad Central University, has reportedly submitted its report.

అప్పారావు సరే.. రోహిత్ ఆత్మహత్యలో దోషులెవరూ..?

Posted: 08/26/2016 06:56 PM IST
Rohit vemula is not a dalit says probe commission

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో ఏకసభ్య కమీషన్ సమర్పించిన నివేదికలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. రోహిత్ వేముల దళితుడు కాదని, కాబట్టి అక్కడ వివక్షకి ఆస్కారం లేదంటూ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నిర్ధారించిడం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అప్పారావు నిర్దోషి అంటూ కమీషన్ తేల్చింది.  అయితే రోహిత్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో దోషులు ఎవరన్నది కూడా స్పష్టం చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తుంది.

రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం వేసిన త్రిసభ్య కమిటీ కేంద్రమంత్రులు నిర్ధోషులని తేల్చడం, ఆ తరువాత ఏక సభ్య కమీషన్ వైస్ ఛాన్సిలర్ అప్పారావును కూడా నిర్ధోషిగా ప్రకటించింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఒక మేధావి అత్మహత్య కేసు నుంచి కేంద్రమంత్రులను, బీజేపి నేతలను, బీజేపి సానుభూతి పరుడిగా వున్న వైస్ ఛాన్సిలర్ అప్పారావును కూడా దూరంగా జరిపే ప్రయత్నాలు చేస్తుందన్న అరోపణలు వినవస్తున్నాయి. అయితే రోహిత్ వేముల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.? ఆయనను విశ్వవిద్యాలయం నుంచి ఎందుకు సస్సెండ్ చేశారు..? హాస్టల్ లో కూడా వుండకూడదని ఎందుకు ఆదేశాలు జారీ చేశారు.? అసలు అయనపై ఈ మేరకు అదేశాలు జారీ చేసిందెవరు..? అన్న ప్రశ్నలకు కూడా స్పష్టంగా కమీషన్ సమాధానాలు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అశోక్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది.
 
అయితే ఈ కమిషన్ యూనివర్సిటీ లో వివక్ష జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, బిజెపి మంత్రులను కాపాడే లక్ష్యంతో ఈ రిపోర్టు తయారయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ దళితుడు కాదని, కనుక వివక్షకి తావులేదని, అలాగే వీసీ పొదిలె అప్పారావుకి రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదని, అతను నిర్దోషి అంటూ కితాబివ్వడం గమనార్హం. ఈ విషయమై రోహిత్ తల్లి రాధిక స్పందిస్తూ ‘‘నేను ఎస్‌సి మాల అని, నా కొడుకు కూడా అదే కులానికి చెందిన వాడని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ లు చెప్పారన్నారు.
 
అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నా కొడుకు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారిస్తారు’’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి బిజెపి మంత్రులను కాపాడేందుకేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసునించి మంత్రులను, తమ అనుచరులను తప్పించేందుకు బిజెపి కుట్రగా దీన్ని అభివర్ణించారు. రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి వేముల ఏకసభ్య కమిషన్ ఎదుట తమ గోడు వినిపించే అవకాశం కూడా రూపన్వల్ ఇవ్వలేదని, అలాగే కులం గురించి ఒక్క ప్రశ్నకూడా తన తల్లి రాధికని గానీ, తనను గానీ అడగలేదని, అలాంటిది రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారణకు వస్తారన్నారు.

ఏకసభ్య కమిషన్, విచారణ సందర్భంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని, తాము చెప్పేదేదీ వినకుండా ‘‘అవన్నీ మాకు తెలుసు, కొత్త విషయాలు చెప్పండి’’ అంటూ తమ వాదాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కమిషన్ ఇవ్వలేదని రాజా తెలిపారు. నిజానికి రోహిత్ ఆత్మహత్యకు కారణమే వివక్ష అయినప్పుడు వివక్ష గురించి చెపుతుంటే చెప్పనివ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తమకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా పూర్తి రిపోర్టు బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Vemula  Prakash Javadekar  HRD Ministry  AK Roopanwal Commission  HCU  

Other Articles