ప్రత్యేక హోదాపై కేంద్రం తమ వైఖరికి మార్చుకున్నందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామాలు చేశామని, ఈ విషయంలో పునరాలోచన, పున:నిర్ణయం తీసుకునే అవకాశమే లేదంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయా.? రావా.? వస్తే ఎలా వస్తాయి.? రాకపోతే.. ఎందుకని రావు.? అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీల రాజీనామాలు అమోదం పొందాయా.? అంటే.. స్పీకర్ కు రీ కన్ఫర్మేషన్ లేఖలను సమర్పించడంతో వైసీపీ ఎంపీల రాజీనామాలు రమారమి అమోదం పోందినట్లే. అయితే అధికారికంగా ఈ విషయం మాత్రం స్పీకర్ కార్యాలయం వెల్లడించాల్సి వుంటుంది.
ఇక ఉపఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ రెండు విధాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒక వాదన ఉప ఎన్నికలు తప్పక వస్తాయని వాదిస్తుండగా, మరో వాదన మాత్రం ఎన్నికలు ఇప్పుడప్పుడే రావని అంటున్నారు. ఏకంగా సార్వత్రిక ఎన్నికలలో భాగంగానే వైసీపీ ఎంపీల పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుపుతారని అంటున్నారు. ఇప్పుడిదే అంశం అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. ఓ వైపు ప్రత్యర్థి పార్టీ నేతలు.. ఉపఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు.
తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ మేరకు పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా ఏప్రిల్ 6వ తేదిన రాజీనామాలు చేశారు. అయితే వీరు పార్టీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నా.. ఆయా నియోజకవర్గాలకు మాత్రం పార్లమెంటు సభ్యులు లేకుండా పోతారు. ఇదే అసలు వాదనను తెరపైకి తీసుకువస్తుంది.
తమ పార్లమెంటు స్థానాలకు ఎంపీలు లేరని, ఇలా అరు మాసాలకు పైగా ఎంపీలు లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని తొలివాదన. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం వున్న నేపథ్యంలో అరుమాసాలకు పైగా మరో అరు మాసాలు అదనంగా తమ నియోజకవర్గాలకు ఎంపీలు వుండకుండా పోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తుందని వారి వాదన. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అని చెబుతున్నారు కొందరు.
అయితే ఇందుకు విభిన్నంగా మరో వాదన కూడా వుంది. ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైనా ఎంపీకి కనీసం ఏడాది పాటు అయినా పదవీ కాలం ఉంటుందంటేనే బై పోల్ జరుగుతుంది అని లేకపోతే ఉప ఎన్నికలు నిర్వహించరని కూడా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎలాగూ లోక్సభ సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. వచ్చే ఏడాది మార్చినెలాఖరు కళ్లా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అంటే మరో పది నెలల్లో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. కాబట్టి.. ఇంతలోనే బైపోల్ నిర్వహించే అవకాశాలు లేవనే అభిప్రాయాలకు కూడా బలం చూకురుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more