ఆంధ్రప్రదేశ్ బీజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హత్య చేయించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ తీరుకు నిరసనగా బీజేపీ నేతలు విజయవాడలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కన్నాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ అలిపిరిలో షా కుటుంబం పై దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రమంత్రులకు, బీజేపీ నేతలకు రెడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం పోలీసులను ప్రయోగిస్తుందని విమర్శించారు.
ఖాకీ డ్రెస్ వేసుకుని పసుపు జండా కింద పోలీస్ శాఖ పని చేస్తోందని విమర్శించిన కన్నా.. పోలీసు అధికారుల తీరు దారుణంగా ఉందని, చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా బీజేపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి పనిచేయడం తమ ఖర్మ అని అన్నారు. చంద్రబాబు గతం గురంచి మోడీ, అమిత్ షా తెలుసుకోలేకపోయారని అన్నారు. చంద్రబాబు రాజకీయా జీవితమంతా కుట్ర, వంచనతోనే సాగిందని కన్నా విమర్శించారు.
ఇంతవరకు సరే కానీ.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మాత్రం అభ్యంతరం చెప్పకుండానే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా కుటుంబానికి వ్యతిరేకంగా నల్లజెండాలు చూపితేనే అది హత్యా అని అరోపిస్తున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు.. తమ అధినేత.. ఐదేళ్ల క్రితం కన్నా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అటు గుజారాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఇటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన దాడులు కూడా హత్యా ప్రయత్నాలేనా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సమయంలో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై రాళ్లు రువ్వింది హత్యా ప్రయత్నంలో భాగమేనా.? అంటూ కాంగ్రెస్ నేతలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ తన మిత్రులతో కలసి వెళ్లిన ప్రైవేటు విమానం.. ల్యాండింగ్ లో తలెత్తిన సమస్యలు, కుదుపులకు గురైన తీరు కూడా ఆయన హత్యకు చేసిన కుట్రలో భాగమేనా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కన్నాగారూ.. మీ బాస్ విషయంలో జరిగింది హత్యయత్నామే అయితే మాజీ బాస్ విషయంలో జరిగింది కూడా అదేనా..? అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. మరి బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు దీనిపై ఎలా స్పందిస్తారో.. అసలు స్పందిస్తారో లేదో..? వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more