Rome italy history of rome italy
rome italy romans seven hills vatican history rome
Rome Italy - History of Rome Italy
Posted: 01/09/2012 01:59 PM IST
|
రోమ్ గురించి చెప్పుకోవడానికి ఎంత సమయమూ చాలదు, రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. చారిత్రక, సాంస్కృతిక సమ్మేళనం ఈ నగరం. రోమ్‌వాసుల జీవనశైలి చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది. అతిథిని సాదరంగా స్వాగతించడం, ఇతరులకు ప్రేమను పంచడమే ప్రధానం అన్నట్లు ఉంటారు. ఒకరికొకరికి మధ్య ఘర్షణలు ఉండవు. ఇక్కడి వాళ్లకు ఎండాకాలం అంటే చాలా భయం. అలాగని ఇక్కడ విపరీతమైన ఎండలు ఉండవు. మనవాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండవు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించదు. కానీ ఆ వేడిని కూడా భరించలేరు. ఉష్ణోగ్రతను మనం సెల్సియస్, సెంటీగ్రేడ్‌లలో కొలుస్తాం, ఇక్కడ ఫారన్‌హీట్‌లో కొలుస్తారు. సమ్మర్ టెంపరేచర్ 90 డిగ్రీల ఫారన్‌హీట్ (దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్)కు చేరుతుంది. అలాగే వర్షపాతాన్ని మనం సెంటీమీటర్లలో కొలుస్తాం, ఇక్కడ అంగుళాల్లో కొలుస్తారు. చలికాలం ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతుంది. మిగిలిన మాసాల్లో 16 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే ఉంటుంది. మార్చిలో 16 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరగానే అమ్మో వేడి మొదలైందని ఆందోళన పడుతుంటారు. ఎండాకాలంలో ఐదున్నరకు సూర్యోదయం అయితే చీకటి పడేసరికి రాత్రి తొమ్మిదన్నర అవుతుంది.
డిసిప్లిన్డ్ లైఫ్‌స్టయిల్! రోమ్‌వాసుల ఆహారపు అలవాట్లు చాలా నిర్దుష్టంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లకు ప్రాధాన్యం ఎక్కువ. వెస్టర్న్ భోజనం చప్పగా ఉంటుందనుకుంటాం కానీ దాదాపు మనం తిన్నంత స్పైసీ టేస్ట్‌నే ఇష్టపడతారు. అయితే రుచిగా ఉంటే ఎక్కువ తినడం, రుచి లేకపోతే ఏదో తిన్నామనిపించినట్లు ముగించడం ఉండదు. దేహానికి ఎంత కావాలన్న విషయంలో వాళ్లకు స్పష్టత ఉంటుంది, అంతే తింటారు. ఒక్క భోజనం విషయంలోనే కాదు ప్రతిదీ సూత్రబద్ధంగా ఉండాలని కోరుకుంటారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణంలో ఏకరూపత కనిపిస్తుంది. కిటికీల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా అద్దాలను అమరుస్తారు. ఒక్కొక్కటి ఒక్కో కాలానికి అనువుగా ఉంటుంది. వేడిని తగ్గించే అద్దం, చలిని నిరోధించే అద్దం... ఇలాగన్న మాట. ఇళ్లన్నీ ఐదంతస్తుల నిర్మాణాలే, పైగా ఒకేవిధమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తారు. రోడ్లు విశాలంగా ఉండడమే కాకుండా వాహనదారులు క్రమశిక్షణతో నడుపుతారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేయడం చాలా సులభం, ప్రమాదరహితం కూడ.
భారతీయత అంటే మక్కువ! రోమ్ వాసులది పూర్తిగా సంప్రదాయ జీవనశైలి. తమ సంస్కృతిని, చారిత్రక నేపథ్యాన్ని కాపాడుకోవడాన్ని చాలా ఇష్టపడతారు. తమది రాయల్ ట్రెడిషన్ అనే భావన ఎక్కువ. బహుశా! అందుకే ఆ సంస్కృతి సంప్రదాయాలను అంతగా ఇష్టపడతారేమో!! వీళ్లకు కామన్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మహిళలు స్కర్టు - షర్ట్ - కోటు, మగవాళ్లు ప్యాంటు - షర్టు ధరిస్తారు. మన దేశం, మన సంప్రదాయం పట్ల క్రేజ్. ఇండియన్స్ కనిపిస్తే బొట్టు అడిగి పెట్టుకుంటారు. బింది స్టిక్కర్ పెట్టుకుని వాళ్లు మురిసిపోవడం చూస్తుంటే... ఇంత చక్కటి అలంకారాన్ని మనవాళ్లు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని బాధేస్తుంది.
నగరంలో తైబర్ నది ప్రవహిస్తుంటుంది. దాని తీరంలో కోటలు ఉంటాయి. కోటలోపలికి వెళ్తే చక్రవర్తుల కాలం కళ్ల ముందు కదులుతుంది. రోమన్ సంప్రదాయ జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తూ... ముష్టియుద్ధాల ప్రతిమలు, కళాఖండాలు ఉంటాయి. యూనివర్శిటీలు కూడా కోటల్లాగానే ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధాని వంటి ఉన్నత స్థాయి ప్రతినిధుల నివాసాలు తెల్లని భవనాలు. ఇక్కడ లైబ్రరీలు, చర్చ్‌లు, ఎక్కువ. నగరంలో దాదాపు 1500లకు పైగా చర్చ్‌లు ఉంటాయి. లైబ్రరీలయితే పురాతనమైనవి. అందులో గ్రీక్ శాస్త్రవేత్తలు, రోమ్ చక్రవర్తుల పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యూజియాలు కూడా విస్తీర్ణంలో చాలా పెద్దవి. తొమ్మిది చదరపు కిలోమీటర్లు వైశాల్యం. వెయ్యికి పైగా గదుల్లో లక్షలాది కళాకృతులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి పోప్‌ల శిల్పాలే. ఇక్కడ ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క నిమిషం కేటాయిస్తే అన్నింటినీ చూడడానికి సంవత్సరాలు పడుతుంది.
మాన్యుమెంట్ సిటీ! వేల సంవత్సరాల రాచరికాన్ని గుర్తు చేస్తూ నగరంలో వేల కొద్దీ నిర్మాణాలు ఉన్నాయి. అవి నగర సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు. భారీ కళా ప్రదర్శనశాలలు, నాటకరంగాలు, రాజకుటుంబీకుల పేర్లతో స్వాగతతోరణాలు, స్నానవాటికలు, సమాధులు, చర్చ్‌లు, ప్రార్థనామందిరాలు, ప్రాచీన దేవతల ఆలయాలు, ఉద్యానవనాలు, కోటలను నగరంతో కలుపుతూ నది మీద వంతెనలు, మ్యూజియాలు... ఇలా నగర ప్రాచీనతను, అత్యున్నతమైన కళావారసత్వాన్ని చాటిచెప్పే నిర్మాణాలు లెక్కలేనన్ని ఉంటాయి. నగరంలో ముస్సోలినీ ఆఫీసు ఉంది. దానిని ఇటలీ ఫాసిజానికి, నియంతృత్వ పోకడలకు చిహ్నంగా భావించి ధ్వంసం చేయలేదు. చారిత్రక సంఘటనలకు ప్రతిరూపంగా భావించి పరిరక్షించుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న చారిత్రక భవనాలను పడగొట్టి కొత్త భవనం కట్టడం అనే భావనకు పూర్తి విరుద్ధం. దానికి మరమ్మతులు చేసి నిలుపుకోవడానికే ప్రయత్నిస్తారు. మధ్యలో కొంత కాలం మసకబారిన ఔన్నత్యాన్ని కాన్‌స్టాంటైన్ ద గ్రేట్ హయాంలో తిరిగి సాధించింది రోమ్. కళలకు ప్రధానమైన కేంద్రంగా విలసిల్లింది. క్రమంగా పునరుజ్జీవన నగరంగా ప్రఖ్యాతి చెందింది.
నగరంలో ఈవెనింగ్ షికారు అంటే ఫౌంటెయిన్‌లనే చెప్పాలి. ఇక్కడ ఫౌంటెయిన్‌లు కూడా కళాఖండాలే. రోమన్ శిల్పాలు, అద్భుతమైన కట్టడాల మీదుగా నీరు జాలువారుతూ ఉంటుంది. పర్యాటకులు రోమ్‌ను సందర్శించినప్పుడు పొందే ఆనందంతోపాటు అసంతృప్తి కూడా ఎక్కువే. ఈ నిర్మాణాలను అలా చూసుకుంటూ వెళ్లిపోవడంలో తీవ్రమైన నిరాశకు లోనవుతుంటారు. గొప్ప వారసత్వాన్ని చూశామన్న తృప్తితోపాటు తమకు ఉన్న తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో చూడలేకపోయామని ఫీలయ్యేవాళ్లే ఎక్కువ.
రోమన్ కలోజియంగా వాడుకలోకి వచ్చిన ఈ నిర్మాణం అసలు పేరు యాంఫిథియేట్రమ్ ఫ్లేవియమ్. ఇది రోమ్‌లో అతి పెద్ద ఆడిటోరియం. రోమ్‌లో మాన్యుమెంట్‌లలో ప్రధానంగా చెప్పుకోవలసిన నిర్మాణం. క్రీ.శ 70 - 80ల మధ్య కట్టిన ఈ ఆడిటోరియంలో 50,000 మంది కూర్చోవచ్చు. ఇందులో రోమ్ సంప్రదాయ లలిత కళలు, మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన ప్రదర్శనలు జరిగేవి. రోమ్ చక్రవర్తి వెస్పానియన్ మొదలు పెట్టిన ఈ నిర్మాణాన్ని టైటస్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ.
|
రోమ్ గురించి చెప్పుకోవడానికి ఎంత సమయమూ చాలదు, రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. చారిత్రక, సాంస్కృతిక సమ్మేళనం ఈ నగరం. రోమ్‌వాసుల జీవనశైలి చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది. అతిథిని సాదరంగా స్వాగతించడం, ఇతరులకు ప్రేమను పంచడమే ప్రధానం అన్నట్లు ఉంటారు. ఒకరికొకరికి మధ్య ఘర్షణలు ఉండవు. ఇక్కడి వాళ్లకు ఎండాకాలం అంటే చాలా భయం. అలాగని ఇక్కడ విపరీతమైన ఎండలు ఉండవు. మనవాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండవు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించదు. కానీ ఆ వేడిని కూడా భరించలేరు. ఉష్ణోగ్రతను మనం సెల్సియస్, సెంటీగ్రేడ్‌లలో కొలుస్తాం, ఇక్కడ ఫారన్‌హీట్‌లో కొలుస్తారు. సమ్మర్ టెంపరేచర్ 90 డిగ్రీల ఫారన్‌హీట్ (దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్)కు చేరుతుంది. అలాగే వర్షపాతాన్ని మనం సెంటీమీటర్లలో కొలుస్తాం, ఇక్కడ అంగుళాల్లో కొలుస్తారు. చలికాలం ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతుంది. మిగిలిన మాసాల్లో 16 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే ఉంటుంది. మార్చిలో 16 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరగానే అమ్మో వేడి మొదలైందని ఆందోళన పడుతుంటారు. ఎండాకాలంలో ఐదున్నరకు సూర్యోదయం అయితే చీకటి పడేసరికి రాత్రి తొమ్మిదన్నర అవుతుంది.
డిసిప్లిన్డ్ లైఫ్‌స్టయిల్!
రోమ్‌వాసుల ఆహారపు అలవాట్లు చాలా నిర్దుష్టంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లకు ప్రాధాన్యం ఎక్కువ. వెస్టర్న్ భోజనం చప్పగా ఉంటుందనుకుంటాం కానీ దాదాపు మనం తిన్నంత స్పైసీ టేస్ట్‌నే ఇష్టపడతారు. అయితే రుచిగా ఉంటే ఎక్కువ తినడం, రుచి లేకపోతే ఏదో తిన్నామనిపించినట్లు ముగించడం ఉండదు. దేహానికి ఎంత కావాలన్న విషయంలో వాళ్లకు స్పష్టత ఉంటుంది, అంతే తింటారు. ఒక్క భోజనం విషయంలోనే కాదు ప్రతిదీ సూత్రబద్ధంగా ఉండాలని కోరుకుంటారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణంలో ఏకరూపత కనిపిస్తుంది. కిటికీల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా అద్దాలను అమరుస్తారు. ఒక్కొక్కటి ఒక్కో కాలానికి అనువుగా ఉంటుంది. వేడిని తగ్గించే అద్దం, చలిని నిరోధించే అద్దం... ఇలాగన్న మాట. ఇళ్లన్నీ ఐదంతస్తుల నిర్మాణాలే, పైగా ఒకేవిధమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తారు. రోడ్లు విశాలంగా ఉండడమే కాకుండా వాహనదారులు క్రమశిక్షణతో నడుపుతారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేయడం చాలా సులభం, ప్రమాదరహితం కూడ.
భారతీయత అంటే మక్కువ!
రోమ్ వాసులది పూర్తిగా సంప్రదాయ జీవనశైలి. తమ సంస్కృతిని, చారిత్రక నేపథ్యాన్ని కాపాడుకోవడాన్ని చాలా ఇష్టపడతారు. తమది రాయల్ ట్రెడిషన్ అనే భావన ఎక్కువ. బహుశా! అందుకే ఆ సంస్కృతి సంప్రదాయాలను అంతగా ఇష్టపడతారేమో!! వీళ్లకు కామన్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మహిళలు స్కర్టు - షర్ట్ - కోటు, మగవాళ్లు ప్యాంటు - షర్టు ధరిస్తారు. మన దేశం, మన సంప్రదాయం పట్ల క్రేజ్. ఇండియన్స్ కనిపిస్తే బొట్టు అడిగి పెట్టుకుంటారు. బింది స్టిక్కర్ పెట్టుకుని వాళ్లు మురిసిపోవడం చూస్తుంటే... ఇంత చక్కటి అలంకారాన్ని మనవాళ్లు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని బాధేస్తుంది.
నగరంలో తైబర్ నది ప్రవహిస్తుంటుంది. దాని తీరంలో కోటలు ఉంటాయి. కోటలోపలికి వెళ్తే చక్రవర్తుల కాలం కళ్ల ముందు కదులుతుంది. రోమన్ సంప్రదాయ జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తూ... ముష్టియుద్ధాల ప్రతిమలు, కళాఖండాలు ఉంటాయి. యూనివర్శిటీలు కూడా కోటల్లాగానే ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధాని వంటి ఉన్నత స్థాయి ప్రతినిధుల నివాసాలు తెల్లని భవనాలు. ఇక్కడ లైబ్రరీలు, చర్చ్‌లు, ఎక్కువ. నగరంలో దాదాపు 1500లకు పైగా చర్చ్‌లు ఉంటాయి. లైబ్రరీలయితే పురాతనమైనవి. అందులో గ్రీక్ శాస్త్రవేత్తలు, రోమ్ చక్రవర్తుల పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యూజియాలు కూడా విస్తీర్ణంలో చాలా పెద్దవి. తొమ్మిది చదరపు కిలోమీటర్లు వైశాల్యం. వెయ్యికి పైగా గదుల్లో లక్షలాది కళాకృతులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి పోప్‌ల శిల్పాలే. ఇక్కడ ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క నిమిషం కేటాయిస్తే అన్నింటినీ చూడడానికి సంవత్సరాలు పడుతుంది.
మాన్యుమెంట్ సిటీ!
వేల సంవత్సరాల రాచరికాన్ని గుర్తు చేస్తూ నగరంలో వేల కొద్దీ నిర్మాణాలు ఉన్నాయి. అవి నగర సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు. భారీ కళా ప్రదర్శనశాలలు, నాటకరంగాలు, రాజకుటుంబీకుల పేర్లతో స్వాగతతోరణాలు, స్నానవాటికలు, సమాధులు, చర్చ్‌లు, ప్రార్థనామందిరాలు, ప్రాచీన దేవతల ఆలయాలు, ఉద్యానవనాలు, కోటలను నగరంతో కలుపుతూ నది మీద వంతెనలు, మ్యూజియాలు... ఇలా నగర ప్రాచీనతను, అత్యున్నతమైన కళావారసత్వాన్ని చాటిచెప్పే నిర్మాణాలు లెక్కలేనన్ని ఉంటాయి. నగరంలో ముస్సోలినీ ఆఫీసు ఉంది. దానిని ఇటలీ ఫాసిజానికి, నియంతృత్వ పోకడలకు చిహ్నంగా భావించి ధ్వంసం చేయలేదు. చారిత్రక సంఘటనలకు ప్రతిరూపంగా భావించి పరిరక్షించుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న చారిత్రక భవనాలను పడగొట్టి కొత్త భవనం కట్టడం అనే భావనకు పూర్తి విరుద్ధం. దానికి మరమ్మతులు చేసి నిలుపుకోవడానికే ప్రయత్నిస్తారు. మధ్యలో కొంత కాలం మసకబారిన ఔన్నత్యాన్ని కాన్‌స్టాంటైన్ ద గ్రేట్ హయాంలో తిరిగి సాధించింది రోమ్. కళలకు ప్రధానమైన కేంద్రంగా విలసిల్లింది. క్రమంగా పునరుజ్జీవన నగరంగా ప్రఖ్యాతి చెందింది.