Stephen hawking history

hawking, stephen, quantum physics, damtp, cosmology, big bang, black hole, Stephe, Hawking, brief, history, of, time, biography, science, cosmology, physics, big, bang, black, holes, carl, sagan

hawking, stephen, quantum physics, damtp, cosmology, big bang, black hole, Stephe, Hawking, brief, history, of, time, biography, science, cosmology, physics, big, bang, black, holes, carl, sagan

stephen hawking history.GIF

Posted: 01/12/2012 04:20 PM IST
Stephen hawking history

stephen_hawking_history

21 ఏళ్లకే అరుదైన వ్యాధి బారినపడ్డారు..
కొన్నేళ్లలోనే పుటుక్కుమంటాడని అందరూ అన్నారు.
చక్రాల కుర్చీలో జీవితం...
మాట కూడా రాని వ్యక్తి ఇక సాధించేదీ ఉండదనీ అనుకున్నారు..
కానీ... ఆ వ్యక్తి వైద్య శాస్త్రానికి సవాలు విసిరాడు.. మరో 49 ఏళ్లు... అదికూడా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా బతికి చూపించాడు.
అంతాబాగానే ఉంది...

ఇంతకీ మోటార్ న్యూరాన్ వ్యాధికి గురైన స్టీఫెన్ హాకింగ్ చేసిందేమిటి?

భౌతిక శాస్త్ర ప్రపంచానికి ఆయన పరిశోధనలు ఎలా ఉపయోగపడ్డాయి. ఆ వివరాలు...

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942, జనవరి 8న జన్మించిన స్టీఫెన్ విలియం హాకింగ్ పేరు చెప్పగానే ఆయన రచన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ గుర్తొస్తుంది. దాదాపు 36 ఏళ్ల క్రితమే ప్రచురితమైన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆదరణ లభించింది. రెండేళ్లుగా stephen-hawking1మాటపడిపోయినా విశ్వం అంచులన్నీ తాకుతున్న హాకింగ్ పరిశోధనల సారం...

1970: గురుత్వశక్తి కూలిపోవడంలో ఏకత్వం: విశ్వ ఆవిర్భావం మొత్తం మహా విస్ఫోటం ద్వారా జరిగిందని సిద్ధాంతాలు చెబుతాయి. ఆ సమయంలో ప్రస్తుతం మనం చూస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నీ అతిదట్టమైన, శక్తి కలిగిన బిందువు రూపంలో ఉండేదని అంచనా. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఈ దశను సింగులారిటీ లేదా ఏకత్వం అంటారు. ఐన్‌స్టీన్ గురుత్వ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో కాలం, స్థలం (స్పేస్) ఈ రెండింటి విషయంలో ఏకత్వానికి చోటుంది. అయితే ఇటువంటి పరిస్థితి వాస్తవమా? కాదా? అన్న విషయంలో అస్పష్టత ఉండేది. రోజర్ పెన్‌రోజ్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త కృష్ణబిలాల్లో ఏకత్వం సాధ్యమని నిరూపించిన నేపథ్యంలో హాకింగ్ పెన్‌రోజ్‌తో కలిసి ఇదే అంశాన్ని విశ్వమంతటికీ వర్తింపజేసి పరీక్షించారు. విజయం సాధించారు. అంటే... ఈ విశ్వం పుట్టుక సమయంలో దాని భౌతికధర్మాన్ని హాకింగ్ నిర్ధారించగలిగారన్నమాట.

కృష్ణబిలాల లక్షణాలు తెలిపాడు: విశ్వంలో అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయిన కృష్ణబిలాల రహస్యాలను వెలికితీసిన మేధావిగా హాకింగ్‌కు పేరుంది. కాంతితోపాటు ఎటువంటి వస్తువైనా కృష్ణబిలంలోకి పడితే నాశనమైపోతుందని... దానికి సంబంధించి ఏ వివరమూ తెలియదని అంచనా. కృష్ణబిలాలు ఉన్నచోట సాధారణ భౌతిక శాస్త్ర నియమాలేవీ పనిచేయవు. ఉష్ణగతికశాస్త్ర నియమాలను పోలిన తనవైన ధర్మాలను కలిగి ఉంటాయి ఈ కృష్ణబిలాలు. ఈ నేపథ్యంలో వీటి ఉపరితల విస్తీర్ణం గురించి హాకింగ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సంప్రదాయ భౌతిక శాస్త్రం వరకూ వీటి ఉపరితలం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదన్నది దీని సారాంశం. ఫలితంగా కృష్ణబిలాలు అత్యంత వేడిని వెదజల్లుతూంటాయని స్పష్టమైంది.

వేడిని చిమ్ముతాయి... మాయమైపోతాయి!

కృష్ణబిలాల శక్తి నుంచి ఏదీ తప్పించుకోలేదని భౌతికశాస్త్రవేత్తలు ఒకప్పుడు అనుకునేవారు.. అది తప్పని నిరూపించిన వ్యక్తి హాకింగ్. కణ భౌతిక శాస్త్రం ఆధారంగా హాకింగ్ కృష్ణబిలాల నుంచి శక్తి విడుదల అవుతుందని... ఆ తరువాత అవి మాయమైపోతాయని హాకింగ్ ప్రతిపాదించారు. కాకపోతే సాధారణ కృష్ణబిలాల విషయంలో ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. సూర్యుడి సైజుండే కృష్ణబిలం ఇలా మాయమయ్యేందుకు విశ్వం వయస్సుకంటే ఎక్కువ సమయం పడుతుందని హాకింగ్ అంచనా కట్టారు. అవే చిన్నసైజువైతే తొందరగా మాయమైపోతాయని చివరిదశలో విపరీతమైన శక్తిని విడుదల చేస్తాయని హాకింగ్ సిద్ధాంతం చెబుతోంది. ఇక చిట్టచివరి సమయంలో ఈ కృష్ణ బిలాల నుంచి విడుదలయ్యే శక్తి పది లక్షల హైడ్రోజన్ బాంబులతో సమానంగా ఉంటుందని లెక్కకట్డారు ఈయన.

stephen-hawkingపాలపుంతల పుట్టుక: ఖగోళశాస్త్రం ప్రకారం మహా విస్ఫోటం ద్వారా పుట్టిన ఈ విశ్వం తొలిదశలో విపరీతంగా వ్యాపనం చెందింది. ఈ దశలో పదార్థం పంపిణీలో జరిగిన సూక్ష్మమార్పుల కారణంగానే పాలపుంతలు పుట్టుకొచ్చాయని హాకింగ్ ప్రతిపాదించారు. అంతేకాదు... ఈ సూక్ష్మమార్పుల కారణంగానే పాలపుంతలు విశ్వం మొత్తంలో పరుచుకుపోయానని కూడా చెబుతున్నారు. గురుత్వశక్తి కారణంగా పదార్థం ఒకదగ్గరకు చేరి లక్షల, కోట్ల నక్షత్రాలు, గ్రహాలుండే పాలపుంతలు ఏర్పడగా... అందుకు చిన్న మార్పులు కారణమన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి హాకింగ్. మహావిస్ఫోటం సమయంలో వెలువడ్డ కాంతిని పరిశీలించినప్పుడు హాకింగ్ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఆనవాళ్లు ఇటీవలే లభించాయి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Highest waterfall in the world
Rome italy history of rome italy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles