కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క – సారలమ్మ.. ఆ చల్లని తల్లుల గద్దె మీద కొలువై, భక్తుల మెరలాలకించే అపురూప ఉత్సవం మేడారం జాతర. కొందరు దేవుళ్లు.. ఆకాశం నుండి ఊడిపడరు. మట్టిలోంచి ఉద్భవిస్తారు. మేఘాల్లో విహరించు... మనుషుల మధ్యే నడయాడతారు. అమరత్వాన్ని ఇష్టపడరు. జనం కోసం ప్రాణాలర్పిస్తారు. అందుకు సమ్మక్క సారలమ్మ లే సాక్షి. మేడారం స్థల పురాణం : గుండె ధైర్యమే మరణ ఫిరంగిగా పొరుసల్పుతున్న గిరిజన దండు ఎంతకాలమని ఆ దండయాత్రకు ఎదురుతిరుతుంది. ఆయుధాలు నిండుకున్నాయి. వనరులు అడుగంటాయి. యోధులంతా నేలకొరిగారు. పగిడిద్దరాజు ప్రాణాలు కొల్పోయాడు. నాగులమ్మ నేల కూలింది. సారలమ్మ వీర మరణం పొందింది. గోవిందరాజు తలవాల్చాడు. ఆ ఘోరాన్ని చూడలేక, జంపన్న సంపెంగ వాగులో దూకాడు. ఆ వాగు జంపన్నను బిడ్డలా ఒడిసి పట్టుకుంది. వీరమాత అనిపించుకోవాలంటే ఎంత అద్రుష్టం ఉండాలి. అందుకనేమో, సంపెంగవాగు పేరు మార్చుకొని జంపన్నవాగు అయ్యింది. పెనిమిటి, పిల్లలు నేల కూలిన వార్త సమ్మక్కకు చేరింది. ఆ తల్లి విషాద దేవత అయ్యింది. ఓ కంట కన్నీరు, ఓ కంట నిప్పు కణికలు. సైన్యాన్ని వెంటపెట్టుకుని సమరానికి బయల్దేరింది. కాకతీయ ప్రభువుల గుండెల్లో దడపుట్టించింది. శత్రు సైనికుల్ని జంపన్న వాగులో ముంచి తేల్చింది. పాలకులకు చెమటలు పట్టాయి. పిరికితనం ఆవహించింది. సమ్మక్కను వెనుక నుండి బల్లాలతో పొడిచి... దొంగదెబ్బ తీశారు. ఆ ఘోరాన్ని చూసి నేల తల్లి కళ్ళెర్ర జేసింది. రక్త ధారలతో ఆ ప్రాంతం ఎర్రబారి పోయింది. నెత్తురోడుతూ... సమ్మక్క మేడారానికి ఈశాన్యంగా ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్ళి మాయం అయ్యింది. కొయదొరలు.. కన్నీళ్ళు పట్టుకున్నారు. దివిటీలు పట్టుకొని గాలించారు. ‘అక్కా సమ్మక్కా’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. జాడ లేదు, జవాబు లేదు, అంతలోనే ఓ కబురు. గట్టు మీద నెమలినార చెట్టు వద్ద... పుట్టకాడ.. ఒక కుంకుమ భరిణ కనిపించిందంటూ... అదే సమ్మక్క ఆనవాలని నమ్మారు. నిద్రహారాల్లేవు. ఆకలిదప్పులు లేవు. ఆ త్యాగమూర్తి రాకకోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు. వారాలు గడిచాయి. నెలలు నిండాయి. ఓ రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. ‘‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఈ స్థంలో రెండు గద్దెలు కట్టింటి, రెండేళ్ళకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి’’ అని ఆకాశవాణి పలికింది. అది సమ్మక్క స్వరం. ఆ సంఘటన ప్రతాపరుద్రుడిలోనూ మార్పు తెచ్చింది. తప్పు తెలుసుకున్నాడు. అహాన్ని వదులుకున్నాడు. సమ్మక్క – సారలమ్మలకు భక్తితో జాతర జరిపించాడు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కోటలు బీటలు వారాయి. సమ్మక్క – సారలమ్మ వనదేవతలై పూజలందుకుంటున్నారు. మహా వైభవంగా.... రెండేళ్ల కోసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది. జాతర ప్రారంభమైన తొలి రోజునే సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్ద రాజు గద్దెలపైకి వస్తారు. గిరిజన సాంప్రదాయంలో విగ్రహరాధన ఉండదు. వెదురు, భరిణె తదితర ప్రతీకలే ఉత్సవమూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే నేటి గద్దె అని చెబుతారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం. మదినిండా భక్తి భావం, కోయదొరల జ్యోస్యాలు, సర్వరోగాలకూ చెట్లమందులు, నెమలి పింఛాలు, శివసత్తుల పూనకాలు ఎడ్లబండ్ల సవ్వడులు... ఆ సందడే వేరు... జానపదుల జాతరంటే మేడారం జాతరే. మరి ఇంకెందుకాలస్యం మీరు కూడా ప్రయాణానికి సిద్ధంకండి. |
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more