ఇస్రో ఆధ్వర్యంలో అప్రతిహతంగా కొనసాగుతున్న విజయపరంపర. వంద రాకెట్ల ప్రయోగాలతో ‘‘ఇస్రో ’’ సెంచరీ సాధించింది. ఈ విజయాలన్నింటికీ అంతరిక్ష ప్రయోగాల కోట శ్రీహరి కోటే కీలకం. ఇక్కడి నుంచే మొదటిసారి రోహిణి125ను ప్రయోగించారు. ఎన్నో కీలక ప్రయోగాలు ఈ భూతల అంతరిక్ష కేద్రం ‘షార్’ నుంచే జరిగాయి. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేద్రం పేరును ఇస్త్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002లో సతీష్ ధావవ్ స్పేస్ సెంటర్(షార్)గా మార్చారు.
శ్రీహరికోట
మనరాష్ర్టంలోని నెల్లూరు జిల్లాలోని ఒక తీర ప్రాంతపు ద్వీపం. పురాణాల నుంచి ఈ ప్రాంతానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ దీవిలో అరకోటి లింగాలను శ్రీరాముడు ప్రతిష్టించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలిగించుకున్నాడని ... అందువల్లే ఈ ప్రాం తానికి శ్రీ అరకోటైగా పేరు వచ్చింది. రాను రాను శ్రీహరి కోటగా మారింది. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక ముందు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. చల్లయా నాదులు తిరిగే ప్రాంతం. రవాణా సౌకర్య, నాగరికత తెలియ నిది. పడవ ప్రయాణం తప్ప బస్సు, కారు అసలు తెలియదు. శ్రీహరికోట దీవి కాలగమనంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కేంద్రంగా మారింది. భూమి లోపల దాగివుండే నిధి నిక్షేపాలు, సముద్రాల నుంచి వచ్చే ప్రమా దాలను తెలిపే వ్యవస్థను కలిగినదిగా ఈ ప్రాంతం మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా విజయాలను శ్రీహరికోట ‘షార్’ సెంటర్ అందించింది.
ఇక్కడే ఎందుకు అనుకూలం?
పులికాట్ సరస్సు, బంగాళాఖాతం, మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన సముద్రం ఉండటం, భూమధ్య రేఖకు సమీపంగా ఉండటం, నిర్జీవ పులికాట్ సరస్సు మరో వైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం లాంటి కారణాలు కూడా కలసి రావడం దీని ప్రత్యేకత. ఒక వేళ ప్రయోగం విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత ఏం టంటే ఈ కేంద్రం భూ మధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరా ఉండటం వల్ల రాకెట్ భూమ్యాకర్షణ శక్తిని తేలికగా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్నట్లుగా పంపించవచ్చు.. భౌగోళికంగా, సాంకేతి కంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ప్రెంచి గయానా ‘‘కౌరు’’రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట రెండో స్థానంలో ఉంది..ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43వేల 3360 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ప్రయోగాలు
1963లో కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని తుంబా నుంచి వాతావరణ పరిశోధన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన అంతరిక్ష పరిశోధన ప్రారంభమైంది. పెద్ద ప్రయోగాలకు తుంబా కేంద్రం అనువుగా లేకపోవడంతో మంచి రాకెట్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అప్పటి అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి స్థలాన్వేషణ ప్రారంభించారు. తూర్పు తీరాన భూమధ్య రేఖకు సమీపంగా ఉండ టంతో శ్రీహరి కోట ప్రాంతాన్ని 1969లో రాకెట్ ప్రయోగాలకు అనువైన కేంద్రంగా ఎంపిక చేశారు. నాటి నుంచి ఈ కేంద్రా నికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని రెండు వందలకు పైగానే రాకెట్‌లను ప్రయోగించారు. 1979 ఆగస్టు 10న ఎస్‌ఎస్‌విఇ1 పేరుతో మొట్టమొదటి రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోట నుండి చేపట్టారు.తొలి ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో కుంగిపోకుండా ముందుకు సాగుతూ ఇప్పటి వరకూ అనేక ప్రయో గాలు చేపట్టింది. సిఎస్‌ఎల్‌వి సీరిస్‌లో 21 ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం తప్ప మిగిలినవన్నీ విజయవంతంగా నిర్వహించారు.
ఆకాశయాత్రలు
నేటి ప్రస్తుత సారధి మాధవన్ నాయర్ ఆ నాడు మన మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలామ్ నాయకత్వంలో 1980 నాటికి ఉపగ్రహ వాహక నౌక ఎస్.ఎల్.వి. ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు నాయర్ సారధిగా మరో విజయంతో చార్త్రిలో తనకు స్థానం కల్పించుకున్నారు. నేడు ఈ రంగంలో ‘‘చంద్రయాన్’’ పేరిట చంద్రమండలానికి మనవారు వెళ్ళగలిగేంతగా మన దేశం కృషి చేస్తున్నది. 2025 నాటికి ఆ కలలు ఫలించగలవని ఆకాంక్ష. ఆనాటికి ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా నిలువగలదని మన శాస్త్రజ్ఞుల అంచనా.
చరిత్రలో చారిత్రక ఘట్టం
తొంభై తొమ్మిది ప్రయోగాలు చేసి వందవ చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది ఇస్రో. ఈ వందో ప్రయోగానికి యావత్ ప్రపంచం మనవైపే చూసేలా చేసింది. పీఎస్‌ఎల్‌వీసి21లో రెండు విదేశీ ఉపగ్రహాలు (ఫ్రాన్స్‌కు చెందిన 715 కిలోల స్పాట్ 6 అనే భూ పరిశీలన ఉపగ్రహం, జపాన్‌కు చెందిన 15 కిలోల ప్రొయిటెరన్,) మనదేశానికి చెందిన 50 కిలోల మినీరెడిస్ ఉపగ్రహం ఉన్నాయి. వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. నాలుగు దశల్లో వాహక నౌక నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష ప్రస్థానం సెంచరీ కొట్టింది.
విజయాల పరంపర
1969లో ‘ఇస్రో’ ఆవిర్భావం తరువాత విజయాలను నమోదు చేసుకుంటూనే ఉంది. దేశీయ అవసరాలకు ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు వాణిజ్య పరంగా కూడా ప్రయోగాలను చేస్తుంది. ఉపగ్రహాలను పంపడం ఒకటి... వాటిని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం క్లిష్టమైన సమస్య. ఉపగ్రహ నిర్మాణంతో పాటు వాటిని ప్రయోగించే వాహక నౌకల నిర్మాణం కూడా ఇస్రో ప్రగతి సాధించింది. 70వ దశకంలో భారత రోదసీ అడుగు ప్రయోగాలకే పరిమితమైయ్యింది. ఆర్యభట్ట, భాస్కర, రోహిణి, యాపిల్ వంటి ఉపగ్రహాల ప్రయోగం జరిపింది. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ వంటి వ్యవస్థలు పుట్టుకు రావటంతో 80వ దశకంలో ఈ ఆధునిక వ్యవస్థల ద్వారా భారత రోదసీ పరిశోధన సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ వచ్చింది. రిమోట్ సెన్సింగ్‌కు సంబంధించినంత వరకూ ప్రపంచంలోనే అత్యంత విస్రుతమైన నెట్‌వర్క్ కలిగిన దేశంగా అరుదైన ప్రతిష్టను సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more