Hyderabadi traditional ramzan haleem

hyderabadi traditional ramzan haleem, ramzan special haleem, cook traditional haleem, holy month of ramzan, hyderabadi-haleems ramzan, hyderabadi haleem homemade, mutton, chicken haleem, ramzan is haleem time in hyderabad, ramzan special - haleem, hyderabadi chicken haleem, hyderabad haleem is now a rs100-crore, perfect haleem, breaking news, ap politics, political news, andhra news, famous pista house haleem,

hyderabadi traditional ramzan haleem, Ramzan Special Haleem,

రాజధానిలో ఘుమఘుమల హలీమ్‌

Posted: 07/16/2013 04:56 PM IST
Hyderabadi traditional ramzan haleem

రాజధానిలో ఘుమఘుమల హలీమ్‌. రంజాన్‌ వస్తుదంటే ముస్లిం సోదరులు ఎంతో ఆనందపడతారు. సంవత్సరంలో వారికిది అతి పెద్ద పండుగ నియమనిష్టలతో చేసే ఉపవాసం నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు మిగతా మతాల వారికి కూడా పండుగే. ఎందుకంటే ఎప్పుడు రంజాన్‌ వస్తుందా.. హలీమ్ ఘుమఘుమ ఎప్పుడు అస్వాదిద్దామా అన్నట్లు ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అనేక సుగంధ ద్రవ్యాలను మేళవించి తయారు చేస్తే హలీమ్ అత్యంత రుచికరం, ఆరోగ్యకరం కూడా. కొందరైతే ఈ ముప్పై రోజులూ హలీమ్ ని తింటుంటారు. మీకో విషయం తెలుసా? మన హైదరాబాద్‌ హలీమ్ కు భౌగోళిక గుర్తింపు కూడా ఉందడోయ్‌. 2010లో నిర్వాహకులు ఈ గుర్తింపును తీసుకొచ్చారు.

చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా సాయంత్రం ఎప్పుడు అవుతుందా? ఎప్పుడు హలీమ్ తిందామా అన్నట్లు ఉంటారు నగరవాసులు. నగరంలోనే కాదు ఇప్పుడు రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో దీన్ని తయారు చేస్తున్నారు.పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ప్రార్ధనలతో, ఉపవాస దీక్షలతో గడుపుతారు. ఐహిక సుఖాలకు దూరంగా ఉంటూ, దైవ చింతనతో గడిపే రోజులివి. దాంతోపాటు ప్రతిరోజు దీక్ష విరమించిన తర్వాత వారు తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం దాక ఎలాంటి ఆహారం లేకుండా నిస్సత్తువ ఆవహించిన వారికి శక్తినందించే ఆహారం ఎంతో అవసరం. సరిగ్గా అందుకోసమే అన్నట్టు తయారయ్యింది హైదరాబాదీ హలీం. పొట్టేలు మాంసం, గోధుమలు, బార్లీ, పప్పులతోపాటు అనేక మసాలాల మిశ్రమంతో చేసే హలీం కేవలం హైదరాబాదీలకే కాదు విశ్వవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రీతిపాత్రమైనది.రంజాన్‌ మాసం అంటే కొన్ని ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి.


హలీమ్‌, ఖర్జూరా, సేమ్యాలు వంటి పదార్థాలు అందరికీ నోరూరిస్తాయి. రంజాను మాసంలో ఎంతో మంది హలీమ్‌ రుచిని ఆస్వాదిస్తూనే ఉంటారు. మరి అలాంటి హలీమ్‌కు పెట్టింది పేరు పురానాషహర్‌. అనేక రకాల మసాలాలు, మాంసం, గోధుమ రవ్వ, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్‌ అన్నింటినీ కలిపి చేసే వంటకమే హలీమ్‌. హలీమ్‌కు ఉన్న ప్రాధాన్య తను బట్టి రంజాన్‌ మాసంలోనే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏడాది మొత్తం కాలం దొరికే ప్రాంతాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హలీమ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌ నుండి విదేశాలకు రోజూ పార్సల్‌ చేయబడుతుందంటే నమ్ముతారా.అన్ని వంటకాలలాగా హలీమ్‌ తయారు చేయడం అంత సులువేమీ కాదు.. కాని తరచూ బయటకెళ్లి తినాలంటే అందరికీ కుదరదు కదా. హలీమ్‌ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కష్టమేమీ కాదు కాని మసాలాలు, శ్రమ కాస్త ఎక్కువే. భారత్‌తో సహా అనేక దేశాల్లో దీన్ని తయారు చేస్తున్నా, ఒక్క హైదరాబాదీ హలీంకే భౌగోళిక చిహ్నంగా గుర్తింపు వచ్చిందంటే అది హైదరాబాద్‌ సంప్రదాయ వంటలకు ఉన్న ప్రత్యేకత ఏంటో రుజువు చేస్తుంది. ఇంతకీ హలీం మొదట తయారైంది మాత్రం హైదరాబాద్లో కాదు. మధ్య ప్రాచ్యంలో చిన్న దేశమైన యెమెన్లో స్థానిక తెగల వారు దీన్ని వందల ఏళ్ల కింద తయారు చేశారు.

అయితే అది ఇప్పటి హలీం కంటే చాలా భిన్నంగా ఉండేది. ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఇప్పుడు హలీం ఇలా మారింది. ఇక హైదరాబాద్‌కు వలస వచ్చిన అరబ్బులు, పర్షియన్లు డెక్కన్‌ ప్రాంతంలో తమ ఇతర వంటలతో పాటు హలీమ్‌ను కూడా పరిచయం చేశారు. ఇక్కడి ఆహారపు అలవాట్లు, పాకశాస్త్ర వైవిధ్యం హలీం రుచిని మరింత ఇనుమడింపచేశాయి.ఇవాళ హైదరాబాదీ వంటల్లో అతిముఖ్యమైన స్థానం సంపాదించిన హలీం, భారత్‌లో భౌగోళిక చిహ్నం పొందిన మొదటి మాంసాహార వంటంకంగా నిలిచింది. గత ఏడాది కేవలం హైదరాబాద్లోనే దాదాపు ఆరువేల హలీం భట్టీలు ఏర్పాటయ్యాయి. సుమారు యాభై దేశాలకు ఎగుమతి చేసిన హలీం తయారీదార్లు వంద కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసారు. ఈ ఏడు అది మరింతగా పెరిగే అవకాశం ఉంది.

 

ముస్లింలతోపాటు ఇతర మతస్తులు కూడా హలీంను ఎంతో ఇష్టంగా తింటారు.

రంజాన్‌ నెలరోజులూ పాతబస్తీ నుంచి హైటెక్‌ సిటీవరకు గల్లీకో హలీం భట్టీ, దాని చుట్టూ వందలమంది కస్టమర్లు కనిపిస్తారు. హైదరాబాదుకు వలస వచ్చినవారు, పర్యాటకులు సైతం హలీం రుచి చూడకుండా ఉండలేరు.ఇంతలా హైదరాబాదుతో హలీం రుచి పెనవేసుకుపోవడానికి కారణం అది ఓ వంటకం మాత్రమే కాదు ఇక్కడి ఐక్యతకు, ప్రత్యేకతకు, అస్తిత్వానికి చిహ్నం.కాగా కొందరు శాఖాహారం తప్పితే మాంసాహారం తినరు. వారికోసం నగరంలోని కొన్ని హోటళ్లు వెజ్‌ హలీంను తయారు చేస్తు న్నాయి. మాంసాహార హలీ మ్‌కు తీసిపోకుండా రుచి, పోషకాలు ఉండేలా దీని రుచిని అందిస్తున్నాయి.


 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles