Red beach in china

Red Beach in China, white-sand and black-sand beaches, China Red Beach,

Tourists flock to white-sand and black-sand beaches, but many consider China s Red Beach one of the world's most spectacular sights.

రెడ్ బీచ్ యొక్క విశేషాలు

Posted: 11/15/2013 01:48 PM IST
Red beach in china

బీచ్ అంటే ఎలా ఉంటుంది? మేటలు వేసిన ఇసుక, ఆ ఇసుకలో మెరిసే గవ్వలు, అడ్డదిడ్డంగా పరుగులు తీసే పీతలు... ఇలాంటివే కనిపిస్తుంటాయి బీచ్‌లలో. కానీ ఆ బీచ్ అలా ఉండదు. ఎరుపురంగును చల్లినట్టుగా ఉంటుంది. ఎర్ర దుప్పటిని ఆరబెట్టినట్టుగా ఉంటుంది. సంధ్యాసమయంలో సూరీడు కనిపించినంత ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అందుకే దాన్ని రెడ్ బీచ్ అని పిలుస్తారు.
 
చైనాలోని దవా కౌంటీలో, ల్యోనింగ్ అనే ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్. అయితే బీచ్ అన్నాం కదా అని ఇది సముద్రతీరం కాదు. ఓ నదీ పరీవాహక ప్రాంతం మాత్రమే. నిజానికి ల్యోనింగ్‌లో ఒకప్పుడు చాలా నదులు ఉండేవట. ఇవన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉండేవని చెబుతారు. వాటిలో కొన్ని కాలక్రమంలో అంతరించి పోయాయి. ఇప్పటికీ చాలా నదులు మిగిలే ఉన్నాయి. అలా మిగిలివున్న పంజిన్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్.
 
ఈ బీచ్ ఎర్రగా ఉండటానికి, అసలు దీన్ని రెడ్‌బీచ్ అనడానికి కారణం... అక్కడ ఆవరించి ఉన్న ఎరుపురంగు మొక్కలు. జీనస్ అనే ఒక రకమైన రెల్లుగడ్డి ఆ ప్రాంతమంతా విస్తారంగా పెరుగుతుంది. ఆ గడ్డిమొక్కలు ఎరుపురంగులో ఉంటాయి. కొన్ని కిలోమీరట్ల మేర ఆవరించిన వాటిని చూస్తే, అక్కడి నేలే అంత ఎర్రగా ఉందా అనిపిస్తుంది. పేరుకు ఇది రెల్లు గడ్డే అయినా దీనితో చాలా ఉపయోగం ఉంది. దీనితో పేపర్ తయారు చేస్తారు. అందుకోసమే ఈ బీచ్‌ను ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు.
 
జీనస్ మొక్కలు ఏప్రిల్ నెల నుంచి ఎదగడం మొదలు పెడతాయి. ఇవి మరీ ఎత్తుగా పెరగవు. అలా అని మరీ చిన్నగా కూడా ఉండవు. తొలుత పచ్చగానే ఉన్నా... పెరిగేకొద్దీ ఎరుపురంగును సంతరించుకుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చేసరికి పూర్తిగా ఎర్రగా మారిపోవడంతో అక్కడంతా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అక్టోబర్ చివరి వారం నుంచి ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles