Mysore brindavan garden details

brindavan garden, brindavan garden news, brindavan garden mysore, mysore brindavan garden photos, brindavan garden place, best tourist places india, india best tourist places, mysore tourism, brindavan garden tourism, brindavan garden

mysore brindavan garden details which looks very beautiful in the evening times with power bulbs

విద్యుత్ వెలుగుల్లా విరజిమ్మే ‘‘బృందావన్’’ గార్డెన్!

Posted: 10/18/2014 05:57 PM IST
Mysore brindavan garden details

మన భారతదేశంలో వుండే పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి వుంటాయి. కొన్ని సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రాచీన కాలానికి చెందిన చారిత్రాత్మక కట్టడాలు వుంటే... మరికొన్ని ఆధునికతో కూడిన నిర్మాణాలు ఎంతో ఆహ్లాదాన్ని నింపుతాయి. అటువంటి వాటిల్లో ‘‘బృందావన్’’ గార్డెన్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే... దేశమొత్తం మీద ఎక్కడాలేని విధంగా ఈ గార్డెన్ రాత్రివేశాల్లో విద్యుత్ వెలుగుల్లా విరజిమ్ముతుంటుంది. ఆ గార్డెన్ వున్న ప్రాంతం మొత్తం ఎంతో ప్రత్యేకంగా కనువిందు చేస్తుంది. అందుకే.. దీనిని వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి ఎంతోమంది పర్యాటకులు వస్తూ వుంటారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/brindavangardens

మైసూరులో వుండే ఈ గార్డెన్.. నగరం నుంచి ఒక గంట ప్రయాణం దూరంలో వుంటుంది. ఈ గార్డెన్ కు చేరుకోవడానికి ప్రత్యేకంగా చాలా బస్సులు అందుబాటులో వున్నాయి కూడా! ప్రకృతి అందాలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ గార్డెన్.. సాయంకాల సమయంలో అక్కడి విద్యుత్ దీపాల అలంకరణ, ఫౌంటేన్ నీటి పొంగులు మొదలైన ప్రత్యేకతలతో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏ విధంగా అయితే ఒక పెళ్లికూతుర్ని అందంగా అలంకరిస్తారో.. అదేవిధంగా ఈ గార్డెన్ రాత్రివేళల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిని కె.ఆర్.ఎస్. ఆనకట్ట అని కూడా అంటాడు. ఈ గార్డెన్ ఎన్నో తోటల సమూహం!

బహుముఖ అందాలతో కూడిన ఈ గార్డెన్ ను పండుగ రోజులు లేదా ఇతర సెలవు దినాల్లో అందులో వుండే తోటలను విద్యుత్ దీపాలతో అలంవకరిస్తారు. అప్పుడు సాయంత్రి 7 నుంచి 8.30 వరకు వాటిని వెలిగిస్తారు. తోటకు మధ్యలో ప్రవేశం వుండటంతో ఇరువైపులా తోటలు ఆ వెలుగుల మధ్య ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brindavan garden  mysore tourism  best tourism places india  diwali news  

Other Articles