The story of guntupalli village which is named as buddharama sthan

guntupalli village story, buddharama sthan village, guntupalli buddharama sthan news, buddharama sthan photos, guntupalli village history, guntupalli village story, guntupally village buddha history

the story of guntupalli village which is named as buddharama sthan

బౌద్ధరామ స్థానంగా ప్రసిద్దిచెందిన చారిత్రక గ్రామం!

Posted: 10/21/2014 04:14 PM IST
The story of guntupalli village which is named as buddharama sthan

భారతదేశం.. ప్రపంచంలోనే చారిత్రాత్మక దేశంగా పేరుగాంచింది. ప్రాచీనకాలానికి సంబంధించి ఇక్కడ ఎన్నో దేవాలయాలు, పురానకథలతో కూడిన దైవస్థలాలు ఎన్నో వున్నాయి. అయితే అందులో తెలియని కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు దేశంలో వున్నాయి. అందులో గుంటుపల్లి ఒకటిగా చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం... బౌద్ధరామ స్థానంగా ప్రసిద్ది చెందింది. నిజానికి బౌద్ధగుహలు జీలకర్రగూడెం ఊరికి ఆనుకునే వున్నప్పటికీ.. అవి గుంటుపల్లి గుహలుగా ప్రసిద్దికెక్కాయి.

చారిత్రాత్మక ప్రాధాన్యత :

సాధారణంగా ఉమ్మడి ఆంధ్రరాష్ట్రం, బుద్ధుని కాలంనుండి బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఇక్కడ అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు ఇప్పటికే ఎన్నో బయటపడ్డాయి. ఇటువంటి క్షేత్రాలలో భట్టిప్రోలును అన్నింటికంటే ప్రాచీనమైనదిగా భావిస్తారు. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినట్లు తెలుస్తోంది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ఈ రెండు క్షేత్రాలు.. అత్యంత ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు పరిగణించబడుతాయి. ఇటీవలికాలంవరకు గుంటుపల్లిని బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఈప్రాంతంలో లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల ఆధారంగా ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపించబడింది. ఈ వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికమైన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.

కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలోనివని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవల్ల... ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guntupally village  buddharama sthan  andhra pradesh  historical places in india  

Other Articles