చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ప్రేమకథలను విన్నాముగానీ... చాలాకాలం వరకు జీవితాంతం కలిసి జీవించిన జంటల గురించి ఎప్పటికీ విని వుండం! నిజానికి చాలాకాలం జీవితాంతం కలిసి మెలిసి వున్న జంటలు ఎక్కువే వున్నాయి కానీ.. దీర్ఘాయువుతోబాటు వృద్ధజంటగా జీవించిన జంటలు అంతగా లేవనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ స్థానం కూడా భర్తీ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఓ జంట అత్యంత వృద్ధ జంటగా గుర్తింపు పొందారు. వాళ్లు వయస్సులో సెంచరీతో నాటౌట్’గా నిలవడంతోబాటు ఇప్పటికీ తమ నాలుగుతరాల పిల్లాపాపలతో సంతోషంగా వున్నారు. వాళ్ల వివరాలేంటో తెలుసుకుందాం...
ఇంగ్లండ్-లో నివాసముంటున్న కరమ్’చంద్ - కర్తారీ దంపతులు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంటగా గుర్తింపు పొందారు. వయసులో ఇద్దరూ సెంచరీ కొట్టారు. భర్త వయస్సు 109 ఏళ్లయితే, భార్య వయసు 102 ఏళ్లు. వీరిద్దరిదీ 1925 లవ్-స్టోరీ. ఇండియాకు చెందిన ఈ వృద్ధజంట 1965లో ఇంగ్లండ్’కు వలసవెళ్లారు. అక్కడే వెస్ట్ యార్క్’షైర్’లో తమ నివాజం ఏర్పరుచుకుని తమ జీవితాన్ని కొనసాగించారు. వీరికి ఎనిమిది మంది సంతానం. 27 మంది మనవలు, 23 మంది ముని మనవలు కూడా వున్నారు. ఇప్పటివరకు ఈ జంట నాలుగు తరాలను చూసేసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సెంచరీ దాటినాకూడా ఇప్పటికీ చలాకీగా డాన్సులు చేస్తూ ఆ దంపతులు గడిపేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటారు. ఆ రోజు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ల సంతామంతాకలిసి సంబరాలు చేసుకుంటారు.
ఇక ఆరోగ్య రహస్యానికి వస్తే.. ఆ పెద్దాయన ప్రతి రాత్రి భోజనానికి ముందు ఓ సిగరెట్ కాలుస్తాడట. వారానికి నాలుగైదు సార్లు బ్రాంది లేదా విస్కీ తీసుకుంటాడట. మరి అవి ఆరోగ్యానికి హాని కదా అని ప్రశ్నిస్తే... మనసుకు నచ్చినట్లు ఉంటేనే సంతోషంగా ఎక్కువ రోజులు జీవిస్తామని సెలవిస్తున్నాడు. దేవుడి ఆశీస్సుల వల్లే తాము సంతోషంగా జీవిస్తున్నామని ఆయన భార్య కర్తారీ చెబుతోంది. ఇంగ్లండ్-లోని పిల్లాపాపలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్న వీరిద్దరూ.. వందేళ్లు దాటినా భర్త, భార్య కలిసిమెలిసి ఇంకా జీవించే ఉండటం విశేషంగా పేర్కొంటున్నారు. నిజంగా ప్రపంచంలోనే ఇదొక అరుదైన ఘట్టమని గిన్నిస్ బుక్ అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more