భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయం ఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం... 13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తూర్పుగంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ (క్రీ.శ. 1236 -క్రీ.శ. 1264) నిర్మించినట్లు చారిత్రాత్మక కథనాల్లో పేర్కొనబడింది. దీని నిర్మాణం ఎంత అద్భుతంగా వుంటుందంటే.. 24 చక్రాలు కలిగిన ఒక భారీరథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లుగా కనువిందు చేస్తుంటుంది. దీనిని ఆనాటికాలపు నగిషీలు ఎంతో అద్భుతంగా అలంకరించారు. మత సంబంధిత (బ్రాహ్మణులకు చెందిన) వాస్తుశాస్త్రానికి ఈ ఆలయం ఒక అద్భుత స్మారక చిహ్నం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది.
స్థలపురాణం :
పురాణ కాలంలో.. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డాడు. అప్పుడతడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో వున్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో అతడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా.. అందులో సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాంతో సూర్యభగవానుడు తనని అనుగ్రహించాడని భావించి సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అలా ఆవిధంగా ఇక్కడ ఆలయం ఏర్పడింది. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం మాత్రం కన్పించదు. అసలు ఆ విగ్రహం ఏమైందన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్లపాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆలయ విశేషాలు :
దేవాలయ ప్రధానద్వారం వద్ద ఉండే రెండు సింహపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్నట్టుగా దర్శనమిస్తాయి. పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఒక నృత్య మందిరం కూడా కనిపిస్తుంది. సూర్యభగవానుడికి వందనం సమర్పించేందుకు దేవాలయ నృత్యకారులు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. దేవాలయం మొత్తం మీద వివిధ రకాల పుష్ప సంబంధిత, రేఖాగణిత నమూనాలు దర్శనమిస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించే రూపంలో మనుష్యులు, దేవతలు, పాక్షిక దైవత్యం కలిగిన రూపాలు సైతం దేవాలయంలో కనిపిస్తాయి.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలూ ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతోపాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more