Sri yadagirigutta narasimha swamy temple special story

telangana yadagiri gutta, yadagirigutta, yadagiri gutta, telanagan main temple, telangana state endowment department, endowments, trs party menifesto, telangana state government will develop yadagirigutta, crores sanctioned to tadagirigutta temple

lord narasimha swamy temple in yadagirigutta nalgonda district, telangana state

గుట్టపై ఉగ్ర నరసింహావతారమై వెలసిన శ్రీ లక్ష్మి నరసింహుడు

Posted: 12/12/2014 09:56 AM IST
Sri yadagirigutta narasimha swamy temple special story

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇప్పుడు ఇది తెలంగాణా రాష్ట్రంలో ప్రధాన ఆలయంగా అభివృద్ధి చెందుతుంది.

ఆలయ చరిత్రని విశ్లేషిస్తే  పురాణాల ప్రకారం.... ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.

తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. అలా యాదగిరి ఉగ్ర నరసింహుడు గుట్టపై వెలిశాడని పురాణం చెప్తుంది.

పురాణం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళినారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yadagirigutta  laxmi narasimha swamy temple  telangana  main temple  

Other Articles