బృహదీశ్వర ఆలయం, పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
చరిత్ర
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
నిర్మాణము
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడినది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై మరియు మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడినది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు 5 సంవత్సరాల [1004 AD – 1009 AD] కాలంలో పుర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడినది.[2] పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 km ఎత్తుకు చేర్చబడినది. అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి. దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడినది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.
ఆలయ విగ్రహాలు
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నవి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని,యముడు,నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more