ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వజ్రాలు ఎన్నో వున్నాయి. వాటి విలువ ఆకాశమే హద్దు అన్నట్లుగా వుంటాయి. ఇతర వ్యవహారాలెందుకు.. కోహినూర్ వజ్రాన్నే ఉదాహరణగా తీసుకోండి.. లండన్’లో సురక్షితంగా వున్న ఈ వజ్రం విలువను ఎవరూ లెక్కగట్టలేరు. భారతదేశానికి చెందిన ఈ వజ్రాన్ని తెల్లదొరలు కొల్లగొట్టుకుపోయిన సంగతి తెలిసిందే! ఆనాడే దాని విలువను పసిగట్టిన వాళ్లు.. ఎంతో తెలివిగా దానిని ఎత్తుకెళ్లిపోయారు.
ఆ వ్యవహారం కాస్త పక్కన పెడితే.. ఈ కోహినూర్ వజ్రంతోబాటు భారత్’లో లభించిన మరికొన్ని వజ్రాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి వున్నాయి. అందులో గోల్కొండ వజ్రం ఒకటి. గొల్కొండ గనుల్లో లభ్యమైన ఈ వజ్రానికి 400 సంవత్సరాల చరిత్ర వుంది. ఒకప్పుడు హైదరాబాద్ చివరి నిజాం దగ్గర వుండేది. 1993లో దీనిని వేలం వేసినప్పుడు దాదాపు 57 కోట్లరూపాయలు పలికింది. కానీ అదే 2013 ఏప్రిల్ 13న న్యూయార్క్’లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ 76 క్యారెట్ల వర్ణరహిత వజ్రం.. ఏకంగా 211 కోట్ల రూపాయల ధర పలికింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. దీనికెంత ప్రాధాన్యత వుందో!
క్లారిటీ, కట్, క్యారెట్ అనే మూడు అంశాల్లోనూ ఎంతో విశిష్టత వున్న ఈ వజ్రానికి ఆర్చ్డ్యూక్ జోసెఫ్ డైమండ్ అని పేరు పెట్టారు. ఇంకొక విషయం ఏమిటంటే.. గోల్కొండ గనుల్లో ఈ వజ్రంతోబాటు ప్రసిద్ధి చెందిన డ్రెస్డెన్ గ్రీన్ డైమండ్, హోప్ డైమండ్, కోహినూర్ వజ్రం కూడా లభ్యమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more