భారతదేశంలో వున్న ద్వాదశజ్యోతిర్లింగాలలో పవిత్రమైన క్షేత్రాలలో శ్రీశైలం ఆలయంలో.. భోళాశంకరుడు, భ్రమరాంబా సమేతుడై కొలువై వున్నాడు. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారిపీఠం కూడా ఒకటి. స్వామివారు స్వయంబుగా వెలిసిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ముక్తి కలుగుతుందని భక్తులు ఎంతో ప్రగాఢంతో నమ్ముతారు. ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగి వున్న ఈ పుణ్యక్షేత్రం.. ర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో వుంది. అసలు స్వామి ఇక్కడ స్వయంబుగా వెలగడం వెనుక ఓ పురాణగాథ వుంది. అదేమిటో తెలుసుకుందామా...
స్థలపురాణం :
శ్రీశైలం ప్రాంతంలో పూర్వం శిలాదుడనే మహర్షి ఓ ‘వరం’ కోరుకోవడం కోసం పరమశివుని గురించి ఘోరతపస్సు చేశాడు. శివుడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చి.. వెంటనే అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దీంతో శిలాదుడు తనకు పుత్రులను ప్రసాదించాల్సిందిగా వరం కోరుకున్నాడు. అతడు కోరుకున్నట్లే శివుడు అతనికి వరం ప్రసాదించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో స్వామివారి వరప్రసాదంగా శిలాదునికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు.
ఆ ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన అనంతరం వారిలో ఒకరైన పర్వతుడు మళ్లీ శివుని గురించి ఘోర తపస్సు చేయసాగాడు. అతనికి తపముకు మెచ్చిన స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో అడగమన్నారు. దీంతో పర్వతుడు స్వామికి దైవంగా నమస్కరించి.. ‘నువ్వు నన్ను పర్వతంగా మార్చి నాపై కొలువుండే వరాన్ని ప్రసాదించు’ అని కోరాడు. అడిగిందే తడువుగా వరాలిచ్చే బోళాశంకరుడు ‘సరే’ అని అక్కడే వుండిపోయాడు. దీంతో కైలాసంలో వున్న పార్వతీదేవి, ప్రమదగాణాలు కూడా స్వామివారి బాటనే పట్టి ఇక్కడే కొలువైవున్నారు.
భ్రమరాంబికా దేవి చరిత్ర :
పూర్వం అరుణాశురుడు అనే రాక్షసుడు సాధుజనాలను, పార్వతీదేవిని నిత్యం బాధలు పెడుతుండేవాడు. రానురాను అతని ఆకృత్యాలు మరింతగా పెరిగిపోయాయి. ఇతని దెబ్బతో ప్రతిఒక్కరు భయభ్రాంతులతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుండేవారు. ఇంకా రానురాను ఆ రాక్షసుడు అందరినీ బాధలు పెడుతుంటే... అది చూసి సహించలేని అమ్మవారు కోపోద్రిక్తురాలైంది. భ్రమరూపిణి రూపం దాల్చి నాదంచేస్తూ ఆ రాక్షసుడ్ని సంహరించింది. అలా ఆ విధంగా భ్రమరూపం దాల్చి దుష్టసంహారం చేయడం వల్ల.. భక్తులు ఆమెను భ్రమరాంబికాదేవిగా కొలుస్తారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more