maha shivratri: why devotees fast and halt through the night మహాశివరాత్రి పర్వదినాన.. ఉపవాసదీక్ష.. జాగరణ చేయడం ఎందుకు.?

Maha shivratri why devotees fast and halt through the night

maha shivratri fasting, maha shivratri jagaran, maha shivratri, maha shivratri secrets, maha shivratri rituals, maha shivratri ligothbavam, The Art of Living Foundation, Sri Sri Ravi Shankar, Yoga, Meditation, Sudarshan Kriya, Spirituality, Stress Relief, Social Transformation, Youth Empowerment, World Peace, Disaster Relief & Trauma Care, NGO, Ayurveda

Fasting is an important activity on Mahashivratri day. All through India, people fast on the day of Mahashivratri. Unlike other Hindu festivals, where food is eaten after performing the puja of the deity, on Shivaratri the fast continues all through the day and night.

మహాశివరాత్రి పర్వదినాన.. ఉపవాసదీక్ష.. జాగరణ చేయడం ఎందుకు.?

Posted: 02/13/2018 06:14 PM IST
Maha shivratri why devotees fast and halt through the night

సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు. శివుడి అజ్ఞ లేనిదే చీమైనా కుట్టునా.. అన్న వ్యాఖ్యంలోని అర్థరార్థం కూడా అదే. భక్తుల పాలిట పెన్నిధి, శంకరా, కరుణించరా అని భక్తిపూర్వకంగా పిలిచిన భక్తులను ఆ పరమేశర్వుడు అనుగ్రహిస్తాడు. పురాణాల్లోని అనేక కథల్లో భోళా శంకరుడైన ఈశ్వరుడు అసుర జాతికి చెందిన వారి తప్పస్సులకు మెచ్చి, వారి ముందు సాక్ష్యాత్కరించి.. వారి కోరికలను అనుగ్రహించి.. కష్టాలను కూడా కొనితెచ్చుకున్న ఘటనలు వున్నాయి.

భక్తిభావంలో మునిగితే చాలునని, అంతేకానీ.. దాని వెనుకనున్న అంతర్యాలు తనకు తెలియవని ఈశ్వరుడు చెప్పనకే చెప్పాడు. అలాంటి శివయ్య అనుగ్రహం పోందడానికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత పవిత్ర దినం. ఈ రోజున మహాశివుడు లింగోద్భవం చెందుతాడు. యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు.

లింగోద్భవం

మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణగాథను తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్తయైన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను బ్రహ్మ, విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనువిప్పు కలిగింది. నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన దినాన్నే శివరాత్రిగా పండితులు పేర్కొంటారు.

ప్రళయ కాళరాత్రి తరువాత జగన్మాత కోరిక మేరకు శివుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపచేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది.

ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం ఒక విశిష్టత. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షమవుతాడు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఒసంగిన భక్తజన బాంధవుడు.

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎందుకు..?

‘శివ’ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన దినాన ఉపవాసం.. జాగరణ నిర్వహించాల్సి వుంటుంది.  ఇలా ఎందుకు చేస్తారంటే... మానవ జీవితానికి రాజస, తామస గుణాలు ఎక్కువగా ప్రభావం కలిగిస్తాయి. రాజసం అంటే పగటి వేళ కలిగే భావోద్వేగం, తామసమంటే రాత్రి వేళ నెలకొనే అంధకారం. వీటిపై నియంత్రణకు ప్రణవ నాదాన్ని పూరించిన మహాశివుని భక్తిలో నిమగ్నం కావాలని శాస్త్రాలు చెబుతన్నాయి.  

ఉప వాసం.. అంటే శివుడికి దగ్గరగా జీవించడం.. పరమేశ్వరుడు సరిగ్గా అర్థరాత్రి వేళ లింగోద్భవం చెందుతాడు కాబట్టి.. ఆ సమయంలో అభిషేకాలు చేయడం.. అర్చనలు, బిల్వార్చలను చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున భక్తులు శివరాధన చేయడంతో లింగోద్భవ అభిషేక పూజలలో పాల్గోంటారు. దీంతో రాత్రి వరకు వారు శివనామస్మరణ చేస్తూనే వుంటారు. ఇలా చేయడమే ఉపవాసం.. అయితే అభిషేకాలు, లింగోద్భవ పూజలు చేసేవారు అర్థరాత్రి వరకు మెలకువగా వుండాలి. అయితే ఘన, ద్రవ పదార్థాలు అహారంగా తీసుకుంటే వారు రాత్రి వేళ.. మెలకువగా వుంటేరని అందుకనే ఖాళీ కడుపుతో వుంటే నిద్ర పట్టదని ఇలా చేయడం అనవాయితీగా వస్తుంది.

ఇలా చేసిన భక్తులకు ఆ పరమేశ్వరుడు సర్వసుఖాలను ప్రసాదిస్తాడని కూడా భక్తుల విశ్వాసం. ఇలా తెలిసి వున్నా.. తెలియక వున్నా ఉపవాస, జాగరణ చేసిన భక్తులకు మాత్రం శివయ్య అనుగ్రహిస్తాడు. ఇలా అనుగ్రహాన్ని పోందిన భక్తుల కథలు అనేకం ప్రాచుర్యంలో వున్నాయి. మహావిశరాత్రి పర్వదినాన లింగార్చనే శ్రేష్టమైనది. ప్రత్యేకంగా మోక్షాన్ని కోరుకునే వారికి పూర్తి పూజకంటే లింగార్చనే ఎంతో మేలు. శివలింగాన్ని ఓంకార మంత్రంతోనూ, శివమూర్తిని పంచాక్షరీ మంత్రంతోనూ పూజించటం సర్వశుభప్రదమని పురాణాలు చెపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles