దేశంలో అతిప్రాచీన దేవాలయాలు అనేకం. అందులో అత్యంత మహిమలు కలిగిన ఆలయాలు కూడా ఎన్నో.. అలాంటి అలయాల్లో ప్రత్యేకలు వున్న అలయాలు కూడా అనేకం. అలాంటి విశిష్టత, ప్రాముఖ్యత, ప్రత్యేకత కలిగిన ఆలయాల్లో రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉన్నఅచలేశ్వర్ మహాదేవ అలాయం కూడా ఒక్కటి. ఈ శివాలయంలో లింగస్వరూపూడిగా దర్శనమిచ్చే పరమేశ్వరుడు.. సాలగ్రామస్వరూపుడిగా వుంటాడు, స్వతహాగా శివలింగం సాలగ్రామరూపంలోనూ లేదా స్పటిక రూపంలో శ్వేతవర్ణం వుంటాయి.
అయితే అచలేశ్వర మహాలింగం మాత్రం సాలగ్రామ రూపంలో వున్నా.. ప్రత్యేకత మాత్రం వుంది, ఈ శివలింగం రోజుకూ మూడు రంగుల్లో కనిపిస్తూ భక్తులకు అభయప్రధానం చేస్తుంది, రోజుకు మూడుకాలలుగా పరిగణించడం అనాదిగా వస్తుంది. అందుకనే త్రికాలం యం పఠేనిత్యం.. అంటూ మంత్రాలలో కూడా చేర్చివుంది. రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకుందామా మరి..అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో మరియు సాయంత్రం వేళ చామర ఛాయ గా కనిపిస్తుంది.
కొన్ని పరిశోధనల వల్ల తెలిసిందేమిటంటే సూర్యుని కాంతి శివలింగం మీద పడటం వల్ల ఇలా జరుగుతుందట. కానీ ఇప్పటి వరకు సైన్టిఫిక్ గా ఎవరూ నిరూపించలేదు. త్రికాల సంధ్యవేళ త్రివర్ణాలతో భక్తులను అశీర్వదిస్తున్న ఈ అచలేశ్వర్ మహాదేవుడి అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు, యాత్రికులు రాష్ట్రం నలుమూలల నుండి వస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని శివలింగాన్ని చూస్తూ తరించిపోతారు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం గా చెబుతారు అక్కడి స్థానికులు.
ఇక్కడి మరొక ఆకర్షణ నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్ని పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు, ముస్లీమ్ ఆక్రమణదారులు ఈ ఆలయం మీద దండెత్తినప్పుడు ఈ విగ్రహం తేనెటీగలతో దాడి చేసిందట. ఆలయం లోని శివలింగం స్వయంభూ లింగాలలో ఒకటి. కొంత మంది ప్రజలు శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more