The best home remedies which made with curd for hair benefits

hair benefits, hair benefits with curd, curd packs for hair, hair styles, home remedies for hairs, olive oil for hairs, health tips for hairs, hair problems, hair packs

the best home remedies which made with curd for hair benefits

మెరుగైన జుట్టుకోసం పెరుగు వాడండి...

Posted: 10/14/2014 03:37 PM IST
The best home remedies which made with curd for hair benefits

ప్రస్తుతకాలంలో జుట్టు సంరక్షణకు సంబంధించి ఎన్నోరకాల కండీషనర్లు, ఇతర రసాయనాలు మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికీ... వాటితో ఏదో సమస్య వస్తోందని మహిళలు బాధపడుతూ వుంటారు. నిత్యం కండీషనర్లు వాడటం వల్ల కేశాలు మృదువుగా మారి, చుండ్ర సమస్య తగ్గినప్పటికీ... జుట్టు మాత్రం అప్పుడప్పుడు రాలిపోతుందని కొంతమంది వాపోతుంటారు. ఎందుకంటే.. జుట్టుకు సహజంగా కావాల్సిన కొన్ని పోషకాలు లభించకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కండీషనర్ల ద్వారా జుట్టు చూడటానికి అందంగానే కనిపించినా... వాటికి కావాల్సిన పోషకాలు లభించకపోవడంతో అప్పుడప్పుడు ఏదో ఒక సమస్య రావడం తప్పదని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

మరి అటువంటి సమస్యలను అధిగమించాలంటే సహజంగానే ఎక్కువ ఔషధగుణాలు లభించే పదార్థాల ద్వారా.. జుట్టును మరింతగా మెరుగుపరుచుకోవచ్చునని చెబుతున్నారు. అందులో ఒకటి ‘‘పెరుగు’’! పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడుతాయి. పెరుగుతో కొన్ని హెయిర్ ప్యాక్స్ ని తయారుచేసుకుని వాటిని నిత్యం పాటిస్తే.. జుట్టును బాగా మెరుగుపరుచుకోవచ్చు. మరి ఆ ప్యాక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం....

1. పెరుగు : ఒక కప్పులో గడ్డపెరుగుని తీసుకుని పేస్ట్ లాగా అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. దీనిని జుట్టుకు, మాడుకు పట్టించి, ఒక మాస్క్ లాగా వేసుకోవాలి. తర్వాత తలచుట్టూ ఒక కాటన్ టవల్ చుట్టుకొని అరగంటపాటు అలాగే వుంచుకోవాలి. తర్వాత తక్కువ గాఢతగల షాంపూతో తలస్నానం చేసి, కండీషనర్ ను అప్లై చేసుకోవాలి. దీంతో జుట్టు మృదువుగా వుండటంతోపాటు కాంతివంతంగా మెరుస్తుంది కూడా!

2. తేనె - పెరుగు మిశ్రమం : ముందుగా గడ్డపెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లనుంచి చివర్ల బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తక్కువ గాఢతగల షాంపుతో తలస్నానం చేసి, కండీషనర్ ను అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకుంటే... త్వరలోనే మంచి ఫలితాన్ని గుర్తించవచ్చు.

3. ఆలివ్ ఆయిల్ - పెరుగు మిశ్రమం : ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనుంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి, ఓ 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తక్కువ గాఢతగల షాంపుతో తలస్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు చేసుకుంటే.. మంచి ఫలితం దక్కుతుంది.

4. మినుములు - పెరుగు మిశ్రమం : ముందుగా మినుముల్ని రాత్రంగా నానబెట్టుకొని, ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికి రాసుకోవాలి. అరగంట తర్వాత తక్కువ గాఢతగల షాంపూతో తలస్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేసుకుంటే మంచిది.

5. మెంతులు - పెరుగు మిశ్రమం : మెంతుల్ని మిక్సీలో వేసి, పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని పెరుగులో వేసి బాగా కలియపెట్టి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని జుట్టు మొదళ్ళనుంచి చివర్లదాకా, మాడుకు పట్టించి గంటపాటు వుంచుకోవాలి. తర్వాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేసుకోవాలి. అనంతరం కండీషనర్ రాసుకోవాలి. అయితే పొడిగా వున్న జుట్టు సమస్యతో బాధపడుతున్నవారికి మాత్రమే ఇది చాలామంచిది. వారానికి రెండుసార్లు చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hair packs  beauty home remedies  health benefits with curd  hair problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more