వాతావరణం చల్లగా మారినప్పుడు చర్మం పొడిబారిపోయి, ముఖం అందానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అప్పుడు ఎన్ని ఫేషియల్ క్రీములు వాడినా త్వరగా ఫలితం లభించదు. పైగా చర్మం మీద మొటిమలు మరీ ఎక్కువగా రావడం.. మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు తీవ్రతరం అవుతాయి. అలాగే క్రీముల్లో వుండే రసాయనాలు చలికాలంలో చర్మాన్ని కాస్త దెబ్బతీస్తాయి. దాంతో చర్మం తెల్లగా వుండాల్సిందిపోయి ఎర్రగా, అక్కడక్కడ మచ్చలు ఏర్పడినట్లుగా వుంటుంది. మరి అటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే... ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్, ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని తగ్గించుకోవచ్చు. చర్మసౌందర్యాన్ని పెంపొందించే ఔషధగుణాలు కలిగిన కొన్ని సహజ పదార్థాలు చాలా వున్నాయి. వాటి ద్వారా ఫేస్ ప్యాక్స్ ను తయారుచేసుకొని... మొటిమలను తొలగించుకోవడంతోపాటు ఇతర సమస్యల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. మరి ఆ హెర్బల్ రెమెడీస్ ఎలా తయారుచేస్తారో, ఎలా అప్లై చేసుకుంటారో మనం తెలుసుకుందాం...
1. నిమ్మపండు : ఇందులో సిట్రస్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మం మీద వుండే పింపుల్స్, స్కార్స్ వంటివి పోగొట్టి... ఎప్పుడూ ఫ్రెష్ గా వుండేలా చేస్తుంది. ఒక కప్పులో కొన్ని నిమ్మ ఆకులు, నిమ్మ పౌడర్ బాగా కలుపుకుని.. అందులో పెరుగు లేదా కీరకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిముషాలు వుంచుకన్న అనంతరం రోజ్ వాటర్ తో కడుక్కోవాలి.
2. పుదీనా : చర్మాన్ని హాని కలిగించే బ్యాక్టీరియాలను చంపడంతోపాటు ఎల్లవేళలా ముఖాన్ని చల్లగా వుంచుతుంది. అలాగే చర్మంలో దాగివున్న దుమ్ము, ధూళి, క్రిములను వెలికితీసి... చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను, ఛాయలను పూర్తిగా నయం చేయడంలో ప్రధానపాత్రను పోసిస్తుంది.
3. వేపాకు : ఇది ముఖవర్ఛస్సుకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖంపై వ్యాపించే మొటిమలతోపాటు నల్లటి మచ్చలను నివారించడంలో భేషుగ్గా పనిచేస్తుంది. వేపాకు రసంలో కొద్దిగా చందనాన్ని జోడించి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజు చేసుకుంటే.. ముఖం మీద మొటిమలు క్రమక్రమంగా తగ్గుతాయి.
4. టొమోటో : ముందుగా టొమాటో తొక్కతీసి గుజ్జు తీసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే.. చర్మం కోమలంగా వుండే నిగారింపు పెరుగుతుంది. నెలకు రెండుసార్లు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ముఖం మీదుంటే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
5. తేనె : తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించి, రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై లేయర్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న జిడ్డుతోపాటు మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more