The steaming benefits for face and skin from which pimples scars remove and look glow shiny

beauty tips, beauty tips for face, beauty tips for pimples, tips to remove pimples, facial tips, facial varieties, steaming for face, steaming benefits for face

the steaming benefits for face and skin from which pimples scars remove and look glow shiny

‘ఆవిరి’తో చర్మసౌందర్యం పెంచుకోండి!

Posted: 10/24/2014 06:43 PM IST
The steaming benefits for face and skin from which pimples scars remove and look glow shiny

చర్మసౌందర్యానికి మార్కెట్లో ఎన్నోరకాల క్రీములు, ఇతర లోషన్లు లభ్యమవుతున్నప్పటికీ.. వాటిలో వుండే రసాయనాలు అప్పుడప్పుడు ప్రభావం చూపుతాయి. వాటిని నిత్యం వాడితూవుంటేనే చర్మం అందంగా కనిపిస్తుంగానీ.. చర్మానికి అందాల్సిన సహజ పోషకాలు మాత్రం అందవు. తద్వారా చర్మం ఎర్రగా మారడం, అక్కడక్కడ మచ్చలు ఏర్పడటం, కల్లనింద నల్లని ఛాయలు వంటి ఏర్పడటం జరుగుతుంది. అలాకాకుండా చర్మసౌందర్యాన్ని సహజంగానే పెంచుకోవాలంటే కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా సాధ్యమవుతుంది. అందులో ఒకటి ముఖానికి ఆవిరి (స్టీమింగ్) పట్టించడం. ఇలా చేస్తే చర్మం ఫ్రెష్ గా తయారవుతుంది. చర్మంలో వుండే రంధ్రాలు తెరుచుకుని లోపల వుండే మలినపదార్థాలను బయటకు తీసేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ అటు అందంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

పద్ధతి : ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో కొన్ని నీటిని పోసి బాగా మరగించాలి. అలా మరిగించిన నీటిని తీసుకుని.. తల, ముఖం మొత్తం కవర్ అయ్యేలా టవల్ కప్పుకోవాలి. అప్పుడు ముఖానికి ఆవిరి పట్టించాలి. ఇలా 5-10 నిముషాల వరకు పట్టించాలి.

1. ఇలా ఆవిరి పట్టించిన వెంటనే చర్మంలోని మతకణాలు తొలగిపోతాయి. అలాగే చర్మకణాలు తెరుచుకొని తేమను అందిస్తుంది. దీంతో చర్మంలో వుండే దుమ్ము, ధూళి మొత్తం బయటకు నెట్టివేయబడుతాయి. అంతేకాదు.. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పూర్తిగా తొలగిపోతాయి కూడా! ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని బాగా రుద్దుకుంటే.. ఇవి సులభంగా తొలగిపోతాయి. తద్వారా చర్మం నునుపుగా మారుతుంది.

2. ఈ ఆవిరి పద్దతి చేయడం వల్ల ముఖంమీదుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతోపాటు చర్మంలో ఏర్పడ్డ టాక్సిన్స్, దుమ్మను పూర్తిగా తొలగించి.. ముఖాన్ని ఫ్రెష్ గా మార్చుతుంది. పొడిచర్మాన్ని తేమగా మార్చి, చర్మాన్ని బిగుతుగా వుండేలా చేస్తుంది.

3. ఆవిరి పట్టించిన మరుక్షణమే ముఖమంతా చెమట నీరుతో నిండిపోతుంది. ఈ నీరే చర్మాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ నీరు చర్మరంధ్రాల్లో సైతం దూరి లోపలుండే దుమ్ము, ధూళిని తొలగించేసి ఫ్రెస్ గా మార్చుతుంది. దాంతో ఫేస్ షైనింగ్ గా మారుతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : steaming tips  beauty tips  healthy beauty tips  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more