మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి అందుకు వీలుగా కొన్ని పోషకాలు విడుదల అవుతుంటాయి. ఆ నేపథ్యంలోనే చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని రెగ్యులర్ గా విడుదల చేస్తుంటుంది. అయితే ఈ నూనె ఎక్కువగా విడుదలైనప్పుడు దాంతోపాటు చర్మంలోని మలిన పదార్థాలు కలిసి బ్లాక్ హెడ్స్, ఇతర మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటితోపాటు వాతావరణ కాలుష్యాలవల్ల ఈ మచ్చలు మరింతగా పెరుగుతాయి. దుమ్ము, ధూళి వంటివి చర్మం మీద పడినప్పుడు అది లోపలికి ప్రవేశించి నూనెగా వున్న చర్మంపై పేరుకుపోతాయి. ఆ సమయంలో బ్యాక్టీరియా వృద్ధి కావడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడుతాయి. ఈ విధంగా ఏర్పడిన ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించడం అంత సామాన్యవిషయం కాదు. వీటిని గిల్లినా, ఏమైనా చేసినా పరిస్థితి విషమంగా మారుతుంటే తప్ప.. అవి మాత్రం తగ్గవు. అయితే వీటిని నివారించేందుకు కొన్ని సహజ మార్గాలు అందుబాటులో వున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...
1. ముందుగా ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లాచేసుకుని.. ఆ మిశ్రమాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
2. ఒక పాన్ లో మూడు నాలుగు కప్పుల నీటిని తీసుకుని బాగా వేడిచేసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలపాలి. ఆ విధంగా కలిపిన నీటిలో శుభ్రంగా వున్న ఓ టవల్‌ను ముంచి ముఖంపై ఉంచుకోవాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. అనంతరం ఒక స్పూన్ పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట బాగా రుద్దుకోవాలి. అలాకొద్దిసేపు వుంచుకుని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
3. గంధపు చెక్క పొడిలో రోజ్‌వాటర్ కలిపి ఒక పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి ఒక ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిముషాల ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
4. ఒక కప్పుడులో నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాను తీసుకుని... అందులో ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. ఒక పేస్ట్ లా చేసిన తర్వాత ముఖానికి బాగా రుద్దుకుని, ఆరిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
5. కొద్దిగా ఓట్‌మీల్ పౌడర్ ను ఒక కప్పులో తీసుకుని అందులో రోజ్‌వాటర్ కలుపుకోవాలి. ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
6. ముందగా కొన్ని మెంతి ఆకులను తీసుకుని బాగా దంచుకోవాలి. ఒక పేస్ట్‌లా చేసుకున్న అనంతరం దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరాత్రి పడుకునే మందు ఇలా చేయాలి.
7. ఒక కప్పులో సరిపడేంత పెరుగు తీసుకుని అందులో నల్లమిరియాల పొడివేసి బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
8. తాజాగా వున్న కొత్తిమీరను తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటినుంచి రసం తీసుకుని అందులోనుంచి ఓ టేబుల్‌స్పూన్ రసాన్ని, పసుపు అర టీ స్పూన్ తీసుకుని మిశ్రమం చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముఖానికి పట్టించుకుని.. ఉదయాన్నే కడుక్కోవాలి.
9. తాజాగా వున్న ద్రాక్షపండ్లను తీసుకుని ఆ పండ్లనుంచి గుజ్జును తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
10. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more