apple orange face packs | beauty tips | skin pimples problems

Apple orange face packs beauty benefits pimples prevention tips

apple face pack, orange face pack, pimples problems, skin problems, beauty tips, beauty tips telugu, skin beauty tips, face beauty tips, face problems, face beauty packs, face problems, face packs, beauty face packs, apple face pack benefits, orange facepack benefits

apple orange face packs beauty benefits pimples prevention tips : By Using Regularly Orange and Apple Face Packs.. Women can get rid off pimples problems within few days.

ఆపిల్, ఆరేంజ్ ఫేస్ ప్యాక్ లతో మొటిమలు మటుమాయం!

Posted: 04/08/2015 03:34 PM IST
Apple orange face packs beauty benefits pimples prevention tips

సాధారణంగా ముఖంపై వచ్చే మొటిమలు అంత సామాన్యంగా వెళ్లవు. ఇవి వచ్చినప్పుడు అందవీహినంగా కనిపించడంతోపాటు ముఖంపై నల్లని మచ్చలు, ఇతర సమస్యలు వస్తాయి. వీటినుంచి ఉపమశనం పొందేందుకు ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినా.. అవి కొన్నికాలాల వరకు మాత్రమే వాటిపై ప్రభావం చూపుతాయి. అనంతరం మళ్లీ అవి తిరిగి వస్తాయి. ఫలితంగా చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. చర్మం పొడిబారిపోవడం, ముసలివారిలాగా కనిపిండం లాంటివి లక్షణాలు వస్తాయి. అలాకాకుండా వుండాలంటే ముందుగా ఈ మొటిమల నుంచి తక్షణమే ఉపశమనం పొందాలి.

ఈ మొటిమలను మటుమాయం చేయడానికి కొన్ని ఫేస్ ప్యాక్స్ వున్నాయి. అందులో ఆపిల్, ఆరేంజ్ ఫేస్ ప్యాక్స్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆ రెండు ఫ్రూట్స్ లో వుండే పోషకాలు మొటిమలను తొలిగించడంతోపాటు చర్మసౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. అలాగే హానికారక క్రిముల నుంచి చర్మాన్ని నిత్యం రక్షిస్తాయి. నిర్జీవంగా మారిన చర్మంలో జీవం పోసి.. నిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి.. ఈ ఆపిల్, ఆరేంజ్ ఫేస్ ప్యాక్ నిత్యం ఉపయోగిస్తే ఎన్నో సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ రెండింటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..

ఆఫిల్ ఫేస్ ప్యాక్ : పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కొద్దిసేపు అలాగే వుంచుకోవాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే.. ముఖంలో వుండే స్కార్స్ మాయమవుతాయి.
 
ఆరేంజ్ ఫేస్ ప్యాక్ : ఆరెంజ్‌లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, ఎ, సి పొందడంతో పాటు కొలాజెన్ ఉత్పత్తికి ఆరెంజ్‌ను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. ఆపిల్ ఫేస్ ప్యాక్ లాగే దీన్ని తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. ఫలితాన్ని గమనించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple face pack  orange face pack  beauty tips telugu  skin pimples problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more