చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంలో బ్యూటీ ప్రోడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయో.. కొన్ని పధార్థాల ద్వారా తయారుచేయబడిన ఫేస్ ప్యాక్స్, రెమెడీస్ ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులో వుండే పోషకాలు త్వరగా చర్మం మీద ప్రభావం చూపి.. సౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందామా..
1. బంగాళదుంప-పెరుగు : ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఒక చెంచా బంగాళాదుంప గుజ్జుకు అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కోమలంగా తయారవుతుంది.
2. ఓట్స్-గుడ్డు-తేనె : ఓ పాత్రలో ఓట్స్, గుడ్డులోని పచ్చసొన, తేనెను సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు, చాలా తాజాగా అనిపిస్తుంది.
3. చక్కెర-ఆలీవ్ నూనె : మూడు టేబుల్ స్పూన్ల చక్కెరలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, మరొక స్పూన్ పాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులపై ప్యాక్ వలే వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో కొలాజిన్ ఉత్పత్తయి మృదువుగా మారుతుంది. అలాగే కాంతివంతంగానూ కనిపిస్తుంది.
4. పాలు-పంచదార-కలబంద : చర్మం పొడిబారిపోయే సమస్యను ఎదుర్కొనే ఓ పాత్రలో పాలు, పంచదార, కలబంద గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. కాసేపాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా కనీసం వారానికి మూడు సార్లు చేస్తే పొడిబారే సమస్య తగ్గుతుంది.
5. కమలాపండు రసం-చక్కెర : జిడ్డు చర్మం గలవారు కమలా పండు రసం, చక్కరను సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, అర గంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more