చర్మసౌందర్యాన్ని పెంపొందించే వాటిలో వాల్నట్ కూడా ఒకటి! ఇందులో చర్మాన్ని మెరుగుపరచడంతోపాటు దాన్ని సంరక్షించే ఎన్నోరకాల పోషక విలువలు నిల్వవుంటాయి. ముఖ్యంగా అందాన్ని పెంచేందుకు సహాయపడే విటమిన్ ఇ, విటమిన్ బి 1,2,3,6లతోపాటు కాపర్, జింక్, కాల్షియం, మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. అందుకే.. వాల్నట్ ని చర్మసౌందర్యాన్ని పెంచే ఔషధంగా భావిస్తారు.
వాల్నట్ తో కలిగే సౌందర్య ప్రయోజనాలు :
1. వాల్నట్ ఆయిల్‌ను చర్మానికి అప్లై చేసినప్పుడు, ఇది మాయిశ్చరైజ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అలాగే డ్రై స్కిన్‌తో బాధపడుతున్నట్లైతే, వాల్నట్ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఈ నూనె చర్మంలోనికి వెళ్లి.. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ముఖ్యంగా చేతులు, మోచేతులకు అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
2. వాల్నట్ ఆయిల్ ముడతలను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది గ్రీజీ టెక్చర్‌ను కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా చర్మానికి అప్లై చేస్తే, చర్మంలో చారలను రూపు మార్చుతుంది. ముడతలకు చెక్ పెట్టి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ఈ ఆయిల్ ను రోజూ రాత్రి సమయంలో పట్టించుకోవాల్సి వుంటుంది.
3. జిడ్డుచర్మం కలిగిన వారు వాల్నట్ ఆయిల్ ను పట్టించుకున్నప్పుడు ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. రోజూ సాయంత్రం వేళ వాల్నట్ ఆయిల్ తగిలించుకుని కొద్దిసేపు అలాగే వుంచుకోవాలి. కాస్త ఎండిన తర్వాత మొదట పొడిబట్టతో శుభ్రంగా తుడుచుకుని, అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
4. మొటిమలు, నల్లని ఛాయలు, కంటికింద నల్లటి వలయాలు, పొడిబారిన చర్మం.. తదితర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆయిల్ ని వారానికి మూడసార్లు ముఖానికి పట్టిస్తే.. వాటి నుంచి ఆపశమనం పొందుతారు. అంతేకాదు.. సౌందర్యవంతమైన చర్మాన్ని పొందడంతోపాటు మృదువైన చర్మాన్ని పొందుతారు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more