చర్మసౌందర్యాన్ని మరింత మెరుగుపరుకోవాలంటే.. అందుకు కొన్ని ఫుడ్స్ వున్నాయి. అవి చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో దివ్యౌషధాలుగా వున్నాయి. ఆ ఫుడ్స్ ని నేరుగా తీసుకోవడం వల్ల గానీ, ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకుని ముఖానికి పట్టించడం వల్ల గానీ మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకీ ఆ పుడ్స్ ఏంటి..? వాటిని ఏ విధంగా ఉపయోగించాలి..? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? అనే విషయాలు తెలుసుకుందామా..
* దోసకాయ : వేసవిలో చర్మానికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గుజ్జును ఫేస్ మాస్క్ లా ముఖానికి పట్టించి, కొద్దిసేపు తర్వాత కడిగేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది. కేవలం దోసకాయ గుజ్జును ముఖానికి రాయడం ద్వారా చర్మానికి తేమ లభిస్తుంది. చర్మం తయారవుతుంది.
* అలోవేరా జెల్ : ఇది చర్మానికి మెరుపునిస్తుంది. సన్ టాన్ నుంచి పోరాడేందుకు అలోవేరా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్‌ని ముఖానికి పట్టించి.. అరగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఇలా చేస్తే ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడినట్లవుతుంది.
* నిమ్మ-తేనె ప్యాక్ : ఒక బౌలులో 1: 2 నిష్పత్తిలో నిమ్మరసం, తేనెను కలిపి ఫ్రిజ్‌లో నిల్వచేయండి. అవసరం అనుకున్నప్పుడు ఫ్రిజ్ నుండి ఈ ప్యాక్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయవచ్చు. ఈ ప్యాక్ పట్టించిన కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసుకుంటే మంచిది. ఈ ప్యాక్ సన్ టాన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
* బ్లూ బెర్రీ : ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. ముడతలను, మచ్చలకు బ్లూబెర్రీ ఫేస్ ప్యాక్ చెక్ పెడుతుంది. కొన్ని బ్లూబెర్రీ పండ్లు తీసుకొని మెత్తగా మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్లో బాగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* పండిన బొప్పాయి ప్యాక్ : బాగా పండిన బొప్పాయి ముక్కలకు, కొద్దిగా తేనె, పంచదార వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం సౌందర్యం మెరుగవవుతుంది.
* చాక్లెట్ ప్యాక్ : ఒక పాత్ర తీసుకుని అందులో కరిగించిన చాక్లెట్ వేయాలి. అనంతరం దాంట్లో బాదం ఆయిల్, పంచదార వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చేసి చర్మానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మంచి నిగారింపు వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more