చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగించడం మాత్రమే కాదు.. పోషకాహారం కూడా తీసుకోవాలని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.. తద్వారా అందానికి సంబంధించి ఎటువంటి సమస్యలు దరిచేరవు. అలాకాకుండా సమస్యలుంటే వుంటే మాత్రం అందాన్ని కోల్పోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. అందంగా ఉండాలంటే పోషకాహారం ఖచ్చితంగా తీసుకోవాలని న్యూట్రీషన్లు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలుంటాయి. ఈ మూడు దోషాలు సమానంగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఫలితంగా అందంగా కనిపిస్తారు.
ఇక చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కొన్ని ఆహారపదార్థాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటిని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం, ఫేస్ ప్యాక్స్ చేసుకోవడం, రెమెడీల్లాగా చేసుకుని పూతలా పట్టించడం.. వంటి విధానాలను పాటిస్తే సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఫ్రూట్స్ ని నేరుగా తీసుకుంటే ఆరోగ్యంతోపాటు సౌందర్య పలితాలను పొందవచ్చు. మొటిమలు, చర్మ ముడతలు, సన్ టాన్ వంటి సమస్యల్ని అధిగమించవచ్చు. ఇక ఈ పోషకాహాలతో ప్యాక్స్ తయారుచేసుకుని చర్మానికి పట్టిస్తే.. మెరుగైన సౌందర్యం సొంతం చేసుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి.. చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఆ బ్యూటీ టిప్స్ ఏంతో తెలుసుకుందామా...
* ఒక పాత్ర తీసుకుని అందులో ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్సు నిమ్మరసం వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పట్టించి.. 20 నిమిషాల వరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడిగేస్తే. చర్మం కాంతివంతం అవుతుంది. అలాగే.. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
* ఒక గిన్నెలో కొత్తిమీర, పుదీనా ఆకులను సమానంగా తీసుకోవాలి. అనంతరం వాటిని ఒక పేస్టులా బాగా కలుపుకోవాలి. ఈ పేస్టులో కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే.. జిడ్డు వెంటనే తొలగిపోతుంది. అలాగే.. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో బాదం, ఓట్స్ సరిపాళ్ళలో వేసుకోవాలి. అనంతరం వాటిని కలియబెడుతూ పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.
* రోజూ తీసుకునే డైట్లో కేరట్ ఉండాలి. ఇవి మొటిమలను దూరం చేయడంతో పాటు కేశాలను సంరక్షిస్తాయి. ఆమ్లాను రోజూ తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. జుట్టు నెరసిపోవడానికి చెక్ పెడుతుంది. రోజూ 3-4 బాదం పప్పులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారు కావడంతో పాటు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.
* పాల మీగడ లేదా పెరుగులో కాస్త తేనె కలుపుకుని కంటికి మర్దన చేసుకుంటే.. కంటి కింద వలయాలు మటుమాయమవుతాయి. జుట్టు నెరసినవారు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తీసుకుంటూ వుండాలి. బాదం ఆయిల్ ఉపయోగించడం మంచిది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more