మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందడం కోసం మహిళలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడటంతోపాటు తరుచుగా బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. వాటితో ఫలితం వుంటుంది కానీ.. అవి ఎఫెక్ట్ అయితే మాత్రం చర్మసమస్యల్ని ఎదుర్కోక తప్పదు. మరి.. అలాంటప్పుడు సౌందర్మం పొందాలంటే ఎలా..? అని ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు అందుబాటులో వున్నాయి. సహజ సిద్ధమైన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* ఉసిరికాయ : ఇందులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది కేశసంరక్ష్ణ కోసం ఉపయోగపడుతుంది. అటువంటి ఈ ఉసిరిని కొబ్బరినూనెలో వేసి తలకు పట్టిస్తే... మృదువైన, దట్టమైన కేశాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. జుట్టు రాలే సమస్య కూడా త్వరగా తగ్గడంతోపాటు కేశాలు ప్రకాశవంతంగా మెరుస్తాయి.
* సున్నిపిండి : ప్రతిరోజూ స్నానానికి ముందు ఈ పిండిని ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేగాకుండా సున్నిపిండి, పాల క్రీమ్ లను ఒక పాత్రలో కలిపి.. ఈ మిశ్రమాన్ని ఓ ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మం మృదువుగా, చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. చర్మంపై వుండే ముడతలూ దూరమవుతాయి.
* ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్ ను ముఖానికి పట్టించి మృదువుగా మసాజ్ చేసుకుంటే.. మొటిమలను నివారించుకోవచ్చు. అలాగే.. చర్మంపై వుండే నల్లని మచ్చలు కూడా చాలావరకు దూరమవుతాయి. అంతేకాదు.. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా.. చాలా సాఫ్ట్ గా, మృదువుగా ఉంటుంది.
* పసుపు : కొందరికి స్కిల్ అలెర్జీ వుంటుంది. బయటికి వెళ్లినప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల వారి చర్మం మరింత అందవిహీనంగా మారుతుంది. అటువంటి వారు పసుపును చర్మానికి ఉపయోగిస్తే.. ఆ అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు. అలా పట్టించడం వల్ల చర్మం ఆరోగ్యంగా తయారవడంతోపాటు సౌందర్యం మెరుగవుతుంది.
* ఆపిల్ : ఒక పాత్రలో ఒక స్పూన్ ఆపిల్ పేస్ట్, ఒక స్పూన్ బంగాళాదుంప పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే.. మొటిమలు, మచ్చలు దూరం అవుతాయి. అలాగే చర్మం మృదువుగా తయారవుతుంది.
* కుంకుమ పువ్వు : ఒక పాత్రలో కొద్దిగా పాలు తీసుకుని అందులో కుంకుమప్వు చేర్చాలి. ఈ రెండింటిని బాగా కలియబెట్టిన తర్వాత ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. అలాగే.. చర్మం తెల్లగా మారుతుంది.
* రోజా పువ్వులు : తాజా రోజా పువ్వులతో ‘రోజ్ వాటర్’ను తయారుచేస్తారు. ఈ వాటర్ ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మంతో బాధపడుతున్నవారు ఈ వాటర్ తో ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటే.. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ప్రకాశవంతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more