చల్లని పాలతో చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చునని బ్యూటీషియన్లు అంటున్నారు. అవును.. చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవడం కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లడం, బ్యూటీ ప్రోడక్ట్స్ అధికంగా వినియోగించాల్సిన అవసరం లేదని, చల్లని పాలు ముఖానికి పట్టిస్తే చాలని వారంటున్నారు. చర్మాన్ని సంరక్షించే పోషకాలతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు పాలలో పుష్కలంగా వున్నాయని.. అటువంటి పాలతో నిత్యం ముఖం శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతిరోజూ ఉదయం లేవగానే చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖం మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇలా పాలతో ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ముఖానికి కొద్దిసేపటివరకు ఎటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ పట్టించకూడదు. ఒకవేళ పట్టిస్తే.. ఎటువంటి ప్రయోజనాలు కలగవని అంటున్నారు. చర్మం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదని వారంటున్నారు. కాబట్టి.. పాలతో మసాజ్ చేసిన తర్వాత కాసేపు ముఖానికి ఏమీ పట్టించుకోకుంటే చాలా మంచిది.
కేవలం పాలు మాత్రమే కాదు.. సౌందర్యాన్ని మెరుగుపరిచే వాటిల్లో మరికొన్ని కూడా వున్నాయి. అందులో శెనగపిండి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. శెనగపిండి, రోజ్ వాటర్ రెండు ఒక గ్లాసులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 వారాలపాటు ప్రతిరోజూ ముఖానికి పట్టించుకోవాలి. ఇలా పట్టించడం వల్ల చర్మం మృదువుగా, చాలా సాఫ్ట్ గా, సౌందర్యంగా తయారవుతుంది. బాదం పేస్టు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు ముఖంలో మచ్చలు, మెటిమలను మాయం చేస్తుంది.
ఇక ముఖసౌందర్యాన్ని మెరుగుపరిచే వాటిలో చీజ్ ఒకటి! చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మరకలు తొలగిపోతాయి. చర్మసౌందర్యం మరింత మెరుగవుతుంది. చర్మం మృదువుగా, సున్నితంగా తయారవుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more