Icici hdfc bank axis probing money laundering accusations

undercover,money laundering accusations,money laundering,market regulator,interest rate,Inflation,ICICI bank,ICICI,HDFC bank,HDFC,Axis Bank

Top private sector lenders ICICI Bank, HDFC Bank and Axis Bank said they were investigating allegations of widespread money laundering practices at their branches

Axis probing money laundering accusations.png

Posted: 03/15/2013 08:32 PM IST
Icici hdfc bank axis probing money laundering accusations

ICICI-HDFC Bank

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మనీలాండరింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నాయి. నల్లధనాన్ని చలామణీలోకి తెచ్చేందుకు ఈ బ్యాంకుల అధికారులు.. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కవుతున్నారంటూ ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ ఒక సంచలనాత్మక కథనాన్ని తెరపైకి తెచ్చింది. ‘ఆపరేషన్ రెడ్ స్పైడర్’ పేరిట నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బైటపెట్టింది. గతంలో తెహల్కాలో పనిచేసిన అనిరుధ్ బహాల్ ప్రమోట్ చేసిన ఈ పోర్టల్ రిపోర్టర్లు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులపై స్టింగ్ అపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ రెడ్ స్పైడర్ పేరుతో నిర్వహించిన ఈ స్టింగ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లో ఉన్న ఈ బ్యాంకుల సీనియర్ అధికారులను మారుపేర్లతో సంప్రదించారు. తమ దగ్గర కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్టుగా చెప్పారు. ఈ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు మూడు బ్యాంకుల సీనియర్ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభిస్తే సొ మ్మును వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ద్వారా లోపాయికారిగా ఎలా ప్రధాన స్రవంతిలోకి తేవచ్చో వివరించారు. బ్యాంకు అధికారులతో సంభాషణల వీడియోలను కోబ్రాపోస్ట్ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ బ్యాంకుల పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అండర్‌కవర్ రిపోర్టర్ దగ్గర్నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుని, దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మౌఖికంగా హామీ ఇస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ ఉదంతంపై విచారణ జరుపుతామని మూడు బ్యాంకులు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian it sector to touch rs 175 lakh cr by 2016
Societe generale to open 4 more branches in 3 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles