Visa on arrival at rajiv gandhi international airport

Hyderabad, visa, Visa on Arrival facilities, Shamshabad, Rajiv Gandhi International Airport.

Much to the relief of over 10 lakh tourists visiting Hyderabad every year, the Rajiv Gandhi International Airport at Shamshabad might soon have Visa on Arrival facilities.

విదేశీయులు వీసాలు ఇక్కడే తీసుకోవచ్చు

Posted: 04/25/2013 12:19 PM IST
Visa on arrival at rajiv gandhi international airport

విదేశీ పర్యాటకులు ఇకపై ముందుగా వీసా తీసుకోకుండానే హైదరాబాద్‌కు వచ్చేయొచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా పొందాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్ (టివిఒఐఎ) సౌకర్యాన్ని ప్రారంభించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. దీంతో పదొండు దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు హైదరాబాద్ విమానాశ్రయంలోనే వీసా పొందే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్‌తోపాటు గోవా, త్రివేండ్రం, బెంగళూరు, కోచి విమానాశ్రయాల్లోనూ ఈ సేవలు వర్తింపచేయాలని నిర్ణయించారు. పర్యాటక శాఖపై ఏర్పాటైన మూడవ అంతర్ మంత్రిత్వ శాఖ సమన్వయ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వీసా ఆన్ అరైవల్ సౌకర్యం వర్తించే దేశాల్లో జపాన్, సింగపూర్, ఫిన్లాండ్, లగ్జెంబర్గ్, న్యూజీలాండ్, కాంబోడియా, లావోస్, వియత్నాం, ఫిలిఫ్పైన్స్, మయన్మార్, ఇండోనేషియాలు ఉన్నాయి. ఇటీవలే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భేటీ అయి హైదరాబాద్‌తోపాటు పలు విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ పరిధిలోకి కొత్తగా మరికొన్ని దేశాలను కూడా తెచ్చేలా చర్యలు తీసుకోవాలని చిరంజీవి కేంద్ర హోం శాఖను కోరారు. ముందస్తుగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా విమాన టిక్కెటు కొనుక్కుని భారత్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం కల్పించటం వల్ల విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles