Honda to start world s largest scooter production unit in gujarat

japan, Honda, world, largest. scooter, production, unit, gujarat, Ahmedabad, vittalpur

japan based Honda to start world's largest scooter production unit in gujarat

ప్రపంచ అతిపెద్ద స్కూటర్ యూనిట్ స్థాపించనున్న హోండా

Posted: 10/17/2014 05:43 PM IST
Honda to start world s largest scooter production unit in gujarat

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మరో అరుదన ఘట్టానికి తెరతీయనుంది. హీరో మోటార్ కార్పోరేషన్ తో బంధం తెంచుకున్న తరువాత భారత్ దేశ మార్కెట్ పై దృష్టి సారించిన హోండా.. అందుకు అనుగూణంగా పావులు కదుపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ల తయారీ యూనిట్ ను గుజరాత్ లో స్థాపించాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ సమీపంలోని విఠల్ పూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం హోండా వచ్చే కొన్ని నెలల్లో రూ.1100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 250 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కు హోండా యాజమాన్యం శంకుస్థాపనలు కూడా పూర్తి చేశారు. 2015 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని హోండా భావిస్తోంది. సంవత్సరానికి 12 లక్షల స్కూటర్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కేవలం బైకులపైనే దృష్టి సారించిన హోండా ఇకపై స్కూటర్ల ఉత్పాదకతపై కూడా దృష్టి కేంద్రీకరించనుంది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  Honda  world  largest. scooter  production  unit  gujarat  Ahmedabad  vittalpur  

Other Articles