Ibm scaling down india business md vanitha narayanan to return to us

staff, Software, payroll, Jobs, investment, IBM, MD Vanitha Narayanan, America, cost cutting measures, robo softwares

IBM scaling down India business, MD Vanitha Narayanan to return to US

భారత్ లో వ్యాపారాన్ని తగ్గించుకుంటున్న ఐబీఎం

Posted: 10/29/2014 05:26 PM IST
Ibm scaling down india business md vanitha narayanan to return to us

భారత్ లో వ్యాపారవాణిజ్యాలను ప్రారంభించిన దశాబ్ద కాలం తరువాత.. ఇప్పడు ఐబీఎం సంస్థ భారత్ లో తమ వ్యాపారా కలాపాలను తగ్గించుకుంటోంది. నిపుణులైన ఇంజనీర్ల బృందంతో భారత్ లో వాణిజ్యకార్యకలాపాలతో కేంధ్రీకృతం చేసిన ఆ సంస్థ ప్రస్తుతం పోదుపు మంత్రాన్ని జపిస్తున్నట్లు సమాచారం. క్రమంగా ఉద్యోగులను తగ్గించుకుంటూ.. వ్యయాన్ని తగ్గించుకోవడంపై శ్రద్ద వహిస్తోంది. సంస్థలో క్రీయాశీలకంగా వున్న టాప్ బాస్ లను కూడా వెనక్కి రప్పించుకుంటోంది.

మూడేళ్ల క్రితం సంస్థలో వున్న లక్షా 65 వేల మంది ఉద్యోగులలో ప్రస్తుతతం కేవలం లక్షా 13 వేలకు కుదించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింత కుదించి కేవలం లక్ష మంది ఉద్యోగులకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సంస్థ యాజమాన్య వ్యహారాలు తెలిసిన వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఐబీఎం మేనేజింగ్ డైరెర్టర్ వనితా నారాయణన్ ను కూడా అమెరికాకు రప్పించుకుంటున్నారని సమాచారం. తన నైపుణ్యంతో భారత్ లో వాణిజ్యాన్ని విస్తరింపజేసే పనిలో భాగంగా అమెరికా నుంచి భారత్ కు వచ్చిన వనితా నారాయణన్.. తిరిగి వెనక్కు రమ్మని పిలిచినట్లు తెలిసింది. వనితా నారాయణన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ హదాలలో వున్న టాప్ లీడర్లనందరినీ వెన్కకి రప్పించుకుంటోంది. దేశాల కరెన్సీతో సంబంధం లేకుండా ఏడాదికి ఏడు లక్షల నుంచి పది లక్షల జీతబెత్యాలున్న టాప్ లీడర్లను కూడా ఐబీఎం సంస్థ అమెరికాలోని ప్రధాన కార్యాలయానికి రప్పించుకోవడం కూడ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే వనితా నారాయణన్ వెనక్కి వెళ్లిన అంశంలో భారత్ లో అమె కనబర్చిన ప్రతిభ కన్నా ప్రపంచ పునరేకీకరణలో భాగంగా సీనియర్లను వెనక్కి రప్పించుకుంటున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భారత్ లో తన వ్యాపార లావాధేవీలను తగ్గించుకుంటుందన్న వార్తలపై ఐబిఎం వర్గాలు కూడా ప్పందించాయి. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ సిద్దంగా వుందని, ప్రస్తుతం తమ సంస్థలో పనిచేసేందుకు మూడు వేల మంది సిబ్బందికి ఓపెనింగ్స్ కూడా పిలుస్తున్నామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. భారత్ లో వాణిజ్యవ్యవహరాలను వనితా నారాయణన్ చూసుకుంటున్నారని, అమె భారత్ ను లీడ్ చేస్తారని సంస్థ యాజమాన్యవర్గాలు తెలిపాయి. వనితా నారాయణన్ ను అమెరికాకు రప్పించుకుంటున్నారన్న వార్తలను ఐబీఎం యాజమాన్యవర్గాలు ఖండించాయి.

తక్కువ వేతనాలకు లభ్యమయ్యే లేబర్ ఇకపై వెండి బుల్లెట్లు కాదని ఆ సంస్థ సంచలన వ్యాఖ్యాలను చేసింది. 1990 దశకం ప్రారంభంలో చావు దరిదాపుల్లోకి వెళ్లిన సంస్థను రక్షించిన ఉద్యోగులపై ఈ సైటర్ వేసింది. అయితే 2011 నుంచి పరిశీలిస్తుంటే సంస్థలో పలు మార్పలు జరుగుతున్నాయని సంస్థ ఉద్యోగులే వాఖ్యానిస్తున్నారు. ఖాళీగా వున్న ఫ్లోర్లు, పెయిట్ పార్కింగ్ స్లాట్లు, ఉద్యోగులకు అందించే కాఫీలలో కోతలను తాము నిశితంగా గమనిస్తున్నామని ఓ ఉద్యోగి తెలిపాడు. భారత్ లో వాణిజ్య సంబంధాలు అవసరం కానీ ఐబీఎం మనుగడ సాధన ప్రాధాన్యత క్రమంలో మాత్రం లేదన్నారు. భారత్లో తొంబైలలో వాణిజ్యకార్యకాలపాలను విస్తరించిన సమయంలో ఐబీఎం మొత్తం బోర్డు సభ్యులను భారత్ లోని బెంగళూరుకు పిలిపించుకున్న ఘటనలు మళ్ళీ పునరావృతం కావాలని ఉద్యోగులు ఆకాంక్షించారు.

ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి గల కారణాలకు ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి. సంస్థలో ఉద్యోగులు చేసే పలు పనులను రోబోలతో చేయించుకుంటున్నారట. దీంతోనే ఉద్యోగుల సంఖ్యను గణణీయంగా తగ్గించుకునేందుకు సంస్థ యాజామాన్యాలు నడుం చుట్టాయని తెలసింది. ఐబీఎంలో ఇప్పటికే మానవ వనరులపై ఆధారపడకుండా సాప్ట్ వేర్ రోబోలు, అటోమేషన్ టూల్స్ వున్నాయని, వాటినే డైనమిక్ అటోమేషన్ గా పిలుస్లున్నారని ఉద్యోగులు వెల్లడించారు. అయితే ఐబీఎం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా లేవని ఇండోర్ కు చెందిన స్ట్రాటజీ ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ రిషికేశ క్రిష్ణన్ తెలిపారు. ప్రస్తుతం అన్ని సాప్ట్ వేర్ కంపెనీలు ఈ రోబోలతోనే పనిచేయించుకుంటున్నాయన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : staff  Software  payroll  Jobs  investment  IBM  MD Vanitha Narayanan  America  cost cutting measures  robo softwares  

Other Articles