ఇంటింటా వినోదాల హరివిల్లును విరబూసిన్తున్న బుల్లితెర తెలుగు మార్కెట్లలో స్టార్ ఇండియా గ్రూప్ ఎంటర్టైన్ మెంట్ అడుగుపెట్టింది. మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య అతిపెద్ద వ్యాపార ఒప్పందం కుదిరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్‌లో మాటీవీ భాగం కానుంది. కొన్ని వాటాలను మాటీవీ...స్టార్ గ్రూప్‌కు విక్రయించింది. మాటీవీ మేనేజ్మెంట్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాటీవీతో ఒప్పంద వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టైఅప్‌తో ఆ లోటు తీరిందన్నారు. అయితే బ్రాడ్కాస్ట్ బిజినెస్‌లో భాగస్వాములం మాత్రమేనని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్...స్టార్‌గా మారుతుందన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
.జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more