Reliance Jio Expected to Launch Services by Mid-July: Credit Suisse

Airtel can compete with reliance jio 4g credit suisse

Credit Suisse, 4G, Reliance Jio, Reliance Jio Infocomm, Telecom, Reliance Jio’s launch likely to shake industry, market, broadband arm of Reliance Industries, Reliance Jio, telcom, Services, RJio, Reliance, Mukesh, Ambani, july, Jio, Infocomm, Credit Suisse, Bernstein Research report, Reliance Jio operations with offers, Reliance Industries, Reliance cheap phones, Reliance Jio, 4G Services,

Reliance Jio Infocomm (RJio) is expected to launch services by mid-July and it will have quite a significant impact on the telecom industry, says a report.

జూలై మధ్యమాసం నుంచి అందుబాటులోకి రిలయన్స్ జియె 4జీ సేవలు

Posted: 05/21/2015 06:13 PM IST
Airtel can compete with reliance jio 4g credit suisse

భారతీయ మోబైల్ ఫోన్ మార్కెట్ సంచలనాలకు తెరలేపిన రిలయన్స్.. మార్కెట్ అంచనాలకు ముందుగానే రిలయన్స్ జియో సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ జియో 4జీ సేవలు జూలై నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇది టెలికం రంగంపై చాలా ప్రభావాన్ని చూపనుందని వివరించింది. రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందుగానే తన 4జీ హ్యండ్‌సెట్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది.

దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్ జియో విక్రయించనున్న 4జీ హ్యండ్‌సెట్ల ధర 80-90 డాలర్ల మధ్యలో ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే రిలయన్స్ జియో 4జీ సేవల ప్రారంభ ఏర్పాట్లు తుది దశకు చేరాయని, అలాగే చాలా సర్కిళ్లలో డిస్ట్రిబ్యూటర్ల జాబితా కూడా ఖరారైందని పేర్కొంది. రిలయన్స్ జియోకి ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్‌టెల్ 4జీ సేవలు ఉన్నాయని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఎయిర్‌టెల్ ఇప్పటికే బెంగుళూరు, ముంబైలలో 4జీ సేవలను అందిస్తోందని, అలాగే గత సోమవారం వైజాగ్, హైదరాబాద్‌లలో కూడా 4జీ ట్రయల్ రన్‌ను నిర్వహించిందని వివరించింది. ప్రస్తుతం 4జీ సర్వీసులలో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్ 4జీ సర్వీసుల్లో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్ వేగం బాగుందని క్రెడిట్ సూసీ కితాబునిచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Credit Suisse  Reliance cheap phones  Reliance Jio  4G Services  

Other Articles