చైనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ పతనం అవుతున్న క్రమంలో ఇక బంగారం వెండి ధరలు పైపైకి ఎగబాకడం ఖాయంగా కనబడుతోంది. ఒక్క రోజులోనే వెయ్యి రూపాయల పైచిలుకు ఎగబాకిన బంగారం ధర.. రానున్న రోజుల్లో సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నష్టాలలో కూరుకుపోతున్న క్రమంలో ఇక బంగారం, వెండీలపైనే తమ పెట్టుబడులు పెట్టాలని మదుపరులు నిశ్చయించుకోవడంతో పసిడి ధరలకు అమాంతం రెక్కలు రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇందుకు గత వారం రోజులుగా ముంబై బులియన్ మార్కెట్లో నమోదవుతున్న ధరలు కూడా ఊతమిస్తున్నాయి.
క్రితం రోజున 24 క్యారెట్లు 10 గ్రాముల ధర అంతకు ముందురోజు ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో పసిడి ధర (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more