జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరుగుతున్న 'ఆటో మొబైల్ షో' సందర్భంగా మంగళవారం ఉదయం బీఎండబ్లూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరాల్డ్ క్రూగర్ కళ్లు తిరిగి పడిపోయారు. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో పేరుగాంచిన బీఎండబ్లూ కొత్తగా తయారు చేసిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ 'ఐ8 సూపర్ కార్' ఆవిష్కరణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు కంపెనీ సీఈవో 49 ఏళ్ల హరాల్డ్ క్రూగర్‌ను కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆయనకు స్టేజ్ ఎక్కగానే కళ్లు తిరిగాయి. ఎడమ చేతి మీదుగా కింద పడిపోయారు. తల నేలకు తగలకుండా రెండు చేతులు తల కింద పెట్టుకున్నారు. ఇంతలో ఇద్దరు కంపెనీ ఉద్యోగులు వచ్చి ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. విలేకరుల సమావేశాన్ని రద్దుచేసి తర్వాత నిర్వహిస్తామని ప్రకటించారు.
హరాల్డ్ను డాక్టర్ వచ్చి పరీక్షించారని, కాస్త అస్వస్థత కారణంగా కళ్లు తిరిగాయని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని డాక్టరు తేల్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ రోజు ఉదయం నుంచే ఆయనకు ఒంట్లో నలతగా ఉండిదని ఆ వర్గాలు చెప్పాయి. ఐ8 సూపర్ కార్ ఇంతకుముందు బీఎండబ్ల్యు విడుదల చేసిన కార్ల కంటే భిన్నమైనది. ఇందులో 1.5 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోలు ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇంజను కారు చక్రాలను తిప్పడానికి కాకుండా కారులోని లిథీయమ్ అయాన్ బ్యాటరీలను చార్జి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more