Coolpad's Dazen Note 3, offering fingerprint sensor, 3 GB RAM at under Rs 10000 to be launched today

Coolpad note 3 launched at rs 8999 exclusive to amazon

Coolpad dual SIM 4G smartphone, Fingerprint scanner, Amazon, indian market, indian smartphone lovers, Gadget Reviews, Technology News, Tech News, Best Gadgets

The Coolpad Note 3 comes with a 5.5-inch HD IPS display and interested buyers need to register for the first sale of the device which will happen on October 20 at 2:00 pm

అమెజాన్ ద్వారా భారతీయ విపణిలోకి కూల్ ఫాడ్ నోట్ 3

Posted: 10/10/2015 05:17 PM IST
Coolpad note 3 launched at rs 8999 exclusive to amazon

భారతీయ స్మార్ ఫోన్ ప్రియులకు మరో స్మార్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ కూల్‌పాడ్.. డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అవిష్కరించింది. కూల్‌పాడ్ నోట్ 3 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.8,999 అని కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు నచ్చిన వారు దీనిని పోందేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ నెల 20 నుంచి జరగనున్న విక్రయాలలో తమ కూల్‌పాడ్ నోట్ 3ని బుక్ చేసుకోవాలని ఆ సంస్థ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జియాంగ్ ఝావో చెప్పారు. .

ఈ ఫోన్ ప్రత్యేకతలు ఇలా వున్నాయి. 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో ఫింగర్ టచ్ సెన్సర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆక్టకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని జియాంగ్ ఝావో వివరించారు. ఈ ఫోన్‌ను భారత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కస్టమైజ్ చేశామని, 13 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coolpad dual SIM 4G smartphone  Fingerprint scanner  Amazon  

Other Articles