Sensex nosedives 418 pts but manages to hold onto 24000-level

Crash in sensex nifty continues rupee tests 68 banks plunge

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The Sensex crashed 640 points to the day's low of 23,839.76, the level last seen since May 16, 2014 when the ruling NDA government came to power.

మార్కెట్లలో మళ్లీ బ్లడ్ షెడ్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..

Posted: 01/20/2016 08:17 PM IST
Crash in sensex nifty continues rupee tests 68 banks plunge

స్టాక్ మార్కెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ హవా వీగిపోయింది. ఆయన హాయంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. అంతకుమునుపటి యూపీఏ ప్రభుత్వం నుంచి బాధ్యతలను చేపట్టిన నాటికి వున్న గణంకాలకు ఇవాళ స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి. అంటే రమారమి 2014 మే నాటి గణంకాలకు దేశీయ సూచీలు పడిపోయాయి. నిన్న నష్టాలను చవిచూసిన మార్కట్లలో ఇవాళ కూడా అదే పతనం అంచున ట్రేడింగ్ ను కొనసాగించాయి. ఇవాళ స్టాక్ మార్కెట్లలో మళ్లీ బ్లడ్ షెడ్ పరిస్థితి ఉత్పన్నమైయ్యంది. దేశీయ సూచీలు భారీ పతనంలో కుంగిపోయాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో మార్కట్లు నష్టపోవడం ఇదే తొలిసారి.

2014 మే 16 తర్వాత ఇంతటి భారీ స్థాయిలో సెన్స్ క్స్ పతనం కాలేదు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 2.39 % పడిపోయి 7,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 2014 జూన్ 2 తర్వాత ఈ స్థాయిలో నిఫ్టీ పతనమవడం ఇదే తొలిసారి. మరో వైపు రూపాయిల్ విలువ కూడా పతనం బాటే పట్టింది. డాలర్ తో రూపాయి మారకం 68.12 కి చేరింది. 2013 సెప్టెంబర్ 4 తర్వాత రూపాయి విలువ ఇంతటి స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. ఈ పతానికి కారణం అంతర్జాతీయంగా పెరిగిన క్యూడ్ ఆయిల్ ధరలు, చైనా మార్కెట్ దెబ్బతినడం కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles