మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి రాగానే ఫోన్ వినియోగం విరివిగా పెరగడం ప్రారంభించి.. స్మార్ట్ ఫోన ఆగమనంలో మరింతగా దూసుకెళ్తూ.. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ తప్పనిసరి వస్తువుగా, అవసరంగా మారిపోయింది. దీంతో వాణిజ్యపరంగా ఎదురులేకుండా వుండేందుకు పలు సర్వీసులు తమ కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లు, పథకాలతో అకర్షిస్తునే వున్నాయి. కాగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు తాజాగా దేశ టెలికాం రంగంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రెండు బడా సంస్థలు ఏకం అవుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి.
అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది.
అయితే విలీనం వార్తలను ఐడియా సెల్యూలార్ సంస్థ తోసిపుచ్చింది. అవన్నీ కల్పిత వార్తలని పేర్కోంది. వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది.
అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు విలీనం దిశగా అడుగులు వేస్తాయా.. లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more