Late rally lifts Nifty above 8800, up 3% in week

Sensex climbs 108 63 points to end at 28532 11

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Renewed buying interest drove equity benchmarks nearly 3 percent higher during the week, which was the first weekly rally after consolidation for a month.

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 8800 మార్కుకు ఎగువన నిఫ్టీ..

Posted: 09/02/2016 05:28 PM IST
Sensex climbs 108 63 points to end at 28532 11

ధేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. వరుసగా నమోదువుతున్న లాభాలతో దేశీయ సూచీలు ఇవాళ 16 మాసాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్పంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు ఐరోపా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలతో మధ్యాహ్నం ముగింపు సెషన్ కు ముందు ఒక్కసారిగా లాభాలలో దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీలు 16 నెలల గరిష్ట స్థాయిని తాకగా, అటు నిఫ్టీ అత్యంత కీలకమైన 8,800 పాయింట్ల మార్కును అధిగమించింది.

రిలయన్స్ జియో ఆఫర్ల దెబ్బకు వరుసగా రెండవ రోజూ టెలికం స్టాక్స్ నష్టపోయాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సైతం నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమాయానికి సెన్సెక్స్ సూచిక 109 పాయింట్లు లాభంతో 28,532.11 పాయింట్ల వద్ద చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 35 పాయింట్లు లాభంతో 8,809.65 పాయింట్ల వద్దకు ఎగబాకింది. బీఎస్ఈలో మొత్తంగా 2,895 కంపెనీల సంస్థల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,528 సంస్థల షేర్లు లాభాలను స్వీకరించగా, 1,198 సంస్థల షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, మధ్య తరహా, చిన్న తరహా సూచీలు అత్యధిక లాభాల్లో దూసుకెళ్లాగా, కన్జూమర్ డ్యూరుల్స్, ఎఫ్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ సూచీలు స్వల్ప లాభాలను అందుకున్నాయి. కాగా, లోహం, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ కు చెందిన సూచీలు నష్టాలలో పయనించాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో పయనించగా, కోల్ ఇండియా, రిలయన్స్, ఏసీసీ, ఇన్ఫోసిస్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles