Midcap at new closing high; TCS tanks 5%

Sensex ends above 29000 up 119 pts

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Equity benchmarks jumped to the highest closing level in last 18 months, driven by FMCG, healthcare, oil and auto stocks.

లాభాల్లో మార్కెట్లు.. 18 నెలల గరిష్ట స్థాయిని తాకిన సూచీలు

Posted: 09/08/2016 06:59 PM IST
Sensex ends above 29000 up 119 pts

ధేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇవాళ మార్కెట్లు 18 నెలల కొత్త శిఖరాలను అందుకున్నాయి, గత పద్దెనిమిది నెలలుగా లేని గరిష్ట స్థాయిని మార్కెట్లు అందుకున్నాయి, ఇవాళ్టి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ సూచీలు కూడా 18 నెలల గరిష్టస్థాయిని తాకాయి. ఐటీ రంగ సూచీలు మార్కెట్లను నష్టాలబాట పట్టినా.. ఆ తరువాత ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, అయిల్, అటో సహా ఫార్మా సూచీలు అందించిన లాభాలతో మార్కెట్లు దూసుకెళ్లాయి,

ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న సూచీలు ముగింపు సమయానికి లాభాలను గడించాయి, ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 29 వేల మార్కుకు ఎగువన ముగియగా, అటు నిఫ్టీ కూడా 8950 మార్కును అధిగమించింది. మార్కెట్ ముగిసే సమాయానికి సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 29,045 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 35 పాయింట్లు లాభంతో 8,952 పాయింట్ల వద్దకు ఎగబాకింది.

ఇవాళ ట్రేడింగ్ లో ఐటీ, టెక్నాలజీ, బీఎస్సీ బ్యాంకింగ్ సూచీలు నష్టాల బాటలో పయనించాయి, ఇక అన్ని సూచీలు ఇవాళ లాభాల భాటలోనే పయనించాయి, అందునా హెల్త్ కేర్, అటో, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్నతరహా, లోహం రంగానికి చెందిన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఐటీసీ, సన్ ఫార్మ, బజాజ్ అటో, టాటా స్టీల్, అరబిందో షార్మ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి తదితర కంపెనీల షేర్లు లాభాల్లో పయనించగా, యస్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బిహెచ్ఇఎల్, గెయిల్, విప్రో, ఇన్ఫోసిస్, తదితర కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles