ఐరోపా మార్కెట్ ప్రభావంతో లాభాలు అవిరి.. Sensex closes up 186 points after trimming early gains

Sensex closes up 186 points after trimming early gains

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Equity benchmarks closed off day's high after losing half of gains in last hours trade. The Nifty failed to hold the 8800 level on profit booking in select banking & financials stocks

ఐరోపా మార్కెట్ ప్రభావంతో లాభాలు అవిరి.. 8800 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 09/16/2016 05:44 PM IST
Sensex closes up 186 points after trimming early gains

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర అటుపోట్లను ఎదుర్కోన్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల ప్రభావంతో మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 250 పాయింట్లకు పైగా జంప్ అయి, సుమారు 400 పాయింట్ల లాభాన్ని తాకింది, కాగా మార్కెట్ ముగింపు సెషన్ లో ఐరోపా మార్కెట్ నుంచి వచ్చిన ప్రతికూల పవనాల ప్రభావంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకుని మళ్లీ తేరుకున్నాయి. ఫలితంగా ముగింపు సమయంలో నిఫ్టీ 8800 మార్కుకు దిగువన ముగిసింది,

ఉదయం అమెరికా రిటైల్ విక్రయాలు ఆగస్టు నెలలో 0.3 శాతం క్షీణించడంతో వడ్డీ రెట్లు పెంచేందుకు ఫెడరల్ విముఖత వ్యక్తం చేస్తుందన్న సంకేతాలు అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు పుంజుకునేందుకు దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో మిడ్ సెషన్ లో 400 పాయింట్ల లాభంతో 28,823 వద్ద వరకు ర్యాలీ కొనసాగించాయి. ఆ తరువాత మళ్లీ ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న అంచనాలకు తోడు ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో మార్కెట్లు ముగింపు సెషన్ లో అరభాగం మేర లాభాలను కొల్పోయాయి.

ఫలితంగా మార్కెట్ నష్టాలలోకి జారుకుని తరువాత కోలుకుంది, దీనికి తోడు మదుపరుల అమ్మాకాల ఒత్తడి కూడా లాభాలను హరించింది. ఫలితంగా మార్కెట్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 186మ పాయింట్ల లాభాంతో 28,599 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 37 పాయింట్ల ర్యాలీతో తన కీలకమార్కు 8,800ను అధిగమించి 8,780 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవాళ మొత్తంగా 2,934 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,323 కంపెనీలు లాభాలను, 1417 కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, 194 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.
 
ఈ నేపథ్యంలో అన్ని రంగలా సూచీలు లాభాలను అర్జించాయి. అటో, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ లాభాలను అర్జించగా, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ రంగాలకు చెందిన సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. ఎఫ్ఎంజీసీ, మెటల్స్, మధ్య తరహా పరిశ్రమల సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ క్రమంలో ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, ఐటీసీ, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, జడ్ఈఈఎల్, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles