దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను ఎదుర్కోన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుస్తారన్న వార్తలు స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్న ఇరువురు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు తొలిసారిగా ముఖాముఖి వాదనకు తలపడనుండటం, రిపబ్లికన్ అభ్యర్థి ముందంజ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కుంగదీయగా, స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు బలహీనంగా ఉండటం, యూరప్ మార్కెట్లూ నష్టాల్లో ప్రారంభం కావడంతో ఏ దశలోనూ బెంచ్ మార్క్ సూచికలు కోలుకునే పరిస్థితి కనిపించలేదు.
సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 120 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ఆపై మరింతగా దిగజారి వచ్చింది. పెద్ద కంపెనీలతో పోలిస్తే, చిన్న కంపెనీలు తక్కువ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 373.94 పాయింట్ల నష్టంతో 28,294.28 పాయింట్ల వద్ద, అటు నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 8,723.05 పాయింట్ల వద్దకు చేరాయి. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగియనుండటం కూడా నూతన కొనుగోళ్లను దూరం చేయడంతో మార్కెట్లను నష్టాలు ముంచెత్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు.
దీనికి తోడు మదుపురులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లో మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే పయనించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తంగా 2,909 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,039 కంపెనీలు లాభాలను, 1,655 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,47,282 కోట్లకు తగ్గింది. ఈ క్రమంలో బీపీసీఎల్, కోల్ ఇండియా, జీ ఎంటర్ టైన్మెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ల్యూపిన్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐడియా సెల్యూలార్ తదితర కంపెనీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more